హైదరాబాద్ రాజేంద్ర నగర్ (Rajendra Nagar) లోని సన్‌సిటీ (Sun City) వద్ద క్రాకర్స్ షాపు (Crackers Shop)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. పక్కనే ఉన్న ఫుడ్ కోర్టుకు మంటలు వ్యాపించడంతో.. అందులోని గ్యాస్ సిలిండర్ పేలడం తో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో మూడు షాఫులకు కూడా ఈ మంటలు విస్తరించాయి. 4 ఫైరింజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది..మంటలను అదుపు చేస్తున్నారు. రాత్రి వేళ దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదానికి గురైన టపాసుల షాప్ కు ఇప్పటివరకు అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని.. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ సిబ్బంది,పోలీసులు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క దేశ వ్యాప్తంగా దీపావళి (Diwali) వేడుకలు మొదలయ్యాయి. జాతి, కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా అంత సమైక్యంగా జరుపుకునే పండుగే దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి (Diwali Celebrations) చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
కుటుంబ సభ్యులంతా క్రాకర్స్ కాలుస్తూ దీపావళి జరుపుకుంటుంటారు. కాకపోతే క్రాకర్స్ పేల్చేటప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తునప్పటికీ కొంతమంది అశ్రద్ధ వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ముఖ్యంగా బాణా సంచా షాప్స్ లలో అనేక జాగ్రత్తలు వహిచాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగిన పెను ప్రమాదానికి దారి తీస్తుంది.
Read Also : Rishabh Pant: వచ్చే ఐపీఎల్ కు రిషబ్ పంత్ రెడీ: సౌరవ్ గంగూలీ