Bandi Bhagirath: బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు

మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు దేశం దాటిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేయించారు. భగీరథ్‌పై ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని బండి సంజయ్‌ ఇంట్లో ఒక పోలీసు […]

Published By: HashtagU Telugu Desk
Conditional bail for Bandi Bhagirath...

Conditional bail for Bandi Bhagirath...

మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు దేశం దాటిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేయించారు. భగీరథ్‌పై ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు

ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని బండి సంజయ్‌ ఇంట్లో ఒక పోలీసు బృందం సోదాలు నిర్వహిస్తోంది. భగీరథ్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నవారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అతని స్నేహితులు, బంధువుల ఇళ్లపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు సమాచారం. నిందితుడి జాడ కనిపెట్టేందుకు అన్ని కోణాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశారు.

మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ విషయంలో భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ దశలో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారానికి వాయిదా వేసింది.

  Last Updated: 16 May 2026, 02:25 PM IST