తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) జూన్ నెలలో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వం డెడ్‌లైన్‌ను నిర్ణయించిందని సమాచారం. ఇటీవల జరిగిన వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమీద ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి రెండు నెలల వ్యవధిలో అమలులోకి వచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
Ugadi 2025 : విశ్వావసు నామ సంవత్సరం వచ్చేసింది.. విశ్వావసు ఎవరు? కథేంటి ?
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లేదా న్యాయస్థానాలు దీనికి అడ్డంకులు సృష్టించినా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. నేరుగా రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ముందుకు సాగాలని ప్రభుత్వం యోచిస్తోంది. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం విభిన్న అవకాశాలను పరిశీలిస్తోంది. స్థానిక సంస్థలలో సామాజిక న్యాయం సాధించేందుకు రిజర్వేషన్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశముంది.
Beard Style Vs Personality : ఒక్కో గడ్డం.. ఒక్కో సంకేతం.. ఒక్కో సందేశం..
ఒకవేళ అనుకున్న రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం లేకుంటే, బీసీలకు 42% స్థానాలను కేటాయించి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లే యోచనలో అధికార పార్టీ ఉందని సమాచారం. ఈ చర్య ద్వారా బీసీ వర్గాల్లో మరింత మద్దతును సంపాదించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాలను రచిస్తోంది. రాబోయే నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశాయి.