KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కాంగ్రెస్ పాలనను సవాలక్ష సార్లు విమర్శిస్తూ ప్రజాసమస్యలపై కాంగ్రెస్ అసమర్థతను ఎత్తిచూపారు. కాంగ్రెస్ అరాచక పాలనపై మండిపడ్డ కేటీఆర్ దివ్యాంగుడైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించడం, ఫ్లెక్సీలు చింపేయడం వంటి ఘటనలను ఆయన ఉదహరించారు. నల్గొండలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు పోలీసుల ముందే భూపాల్ రెడ్డిని బూతులు తిడుతూ దాడికి పాల్పడటం తీవ్ర విచారకరమని అన్నారు.
దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, పోలీసులు భూపాల్ రెడ్డినే అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడం కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు ఏ స్థాయికి దిగజారాయో చూపించిందని కేటీఆర్ మండిపడ్డారు. తమ నాయకుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన డిమాండ్ చేశారు.
White Pepper Vs Black Pepper : నల్ల, తెల్ల మిరియాల్లో వంట, ఆరోగ్యానికి ఏది మంచిది?
కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ క్రైమ్ సిటీగా
కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలన వల్ల హైదరాబాద్ క్రైమ్ సిటీగా మారిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన హైదరాబాద్‌ను కాంగ్రెస్ పాలన గందరగోళంలోకి నెట్టిందని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంచెలు వేసి రక్షించిన ప్రభుత్వ పార్కులు ఇప్పుడు రక్షణ లేకుండా పోయాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో నగర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి తలసాని నివాసంలో జరిగిన సమావేశంలో, నగర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. గ్రామసభలు, వార్డు సభల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ప్రజలకు పూర్తిగా అర్థమైందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారుకు నగర ప్రజలు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై దాడి, నగర అభివృద్ధి సమస్యలపై కాంగ్రెస్ పాలన నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి దిశగా నడిపేందుకు బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Hindusim : హిందూమతం యొక్క 7 అత్యంత శక్తివంతమైన చిహ్నాలు, వాటి విధులు ఏమిటి?