KTR: ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభానికి కేటీఆర్ దూరం!

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ (KTR) హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

  • Written By:
  • Updated On - December 14, 2022 / 12:49 PM IST

దేశంలో (India) విప్లవాత్మక మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్చేసిన విషయం తెలిసిందే. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బుధవారం మధ్యాహ్నం 12.47 గంటలకు బీఆర్‌ఎస్ (BRS) కేంద్ర కార్యాలయాన్ని ముహూర్తానికే ప్రారంభించారు కేసీఆర్. ముందుగా బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కేసీఆర్ తన ఛాంబర్‌కు వెళ్లారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరినీ కేసీఆర్ ఆహ్వానించారు. పలు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, రైతు నేతలు హాజరయ్యారు.

ఇప్పటికే కొందరు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ముఖ్యులు హస్తినకు చేరుకున్నారు. అయితే ఢిల్లీలోని బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ (KTR) హాజరుకాలేకపోతున్నారు. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేటీఆర్‌ (KTR) సమాచారం అందించారు. కేసీఆర్ అనుమతితోనే బీఆర్‌ఎస్ (BRS) కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరుకావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్ లో రెండు కీలక పెట్టుబడుల సమావేశాల కారణంగా కేటీఆర్ (KTR) ఢిల్లీకి వెళ్లలేకపోతున్నారని వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ అంతర్జాతీయ విభాగాల అధిపతులతో కేటీఆర్ (KTR) ఇవాళ సమావేశం కానున్నారు. మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు సుజుకీ బృందం ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. టైమ్ మేనేజ్‌మెంట్, షెడ్యూలింగ్ వంటి వాటికే జపాన్ కంపెనీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయని తెలిసింది.

Also Read: Prabhas Unstoppable: ఏం చెబుతున్నావ్ డార్లింగ్.. బాలయ్యతో బాహుబలి సందడి!