KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. నేటి నుంచి వరసగా అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతూ, ప్రజలతో మమేకమవుతూ ఆయన పర్యటనలు సాగననున్నాయి. ఈ క్రమంలోనే కేటీఆర్ నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.
Read Also: Indian Student : అమెరికాలో భారత విద్యార్థి అరెస్ట్.. హమాస్‌తో లింకులు ?
ఇక, వరసగా అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటనలు కొనసాగనున్నాయి. సాయంత్రం కుత్బుల్లాపూర్ లో జరిగే ఇఫ్తార్ విందుకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లాల ముఖ్య కార్కకర్తలతో సమావేశమవుతారు. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన తీరును ఎండగడతారు. ఇక బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించాలని కార్యకర్తలను, నేతలను కోరనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావటంతో ఇక నిరసనల నిర్వహణ దిశగా కార్యాచ రణ సిద్దం చేస్తోంది. వీటి నిర్వహణ పైన కేటీఆర్ పార్టీ శ్రేణులకు, జిల్లా నేతలకు, కార్యకర్తలకు కేటీఆర్ స్వయంగా మార్గదర్శనం చేయనున్నారు. ఇప్పటికే కేటీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ పైన స్పష్టత ఇచ్చారు. నేడు సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.
కాగా, బీఆర్ఎస్ 25 వ వార్షికోత్సవం వేళ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్దం అవుతోంది. జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారైంది. ఇప్పటి కే మాజీ సీఎం కేసీఆర్ తాజాగా తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వరంగల్‌లో లక్షలాదిమంది పాల్గొననున్న భారీ బహిరం గ సభను విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో, ఇప్పుడు కేటీఆర్ పర్యటనతో రాజకీయంగా మరోసారి ఉత్కంఠ పెరుగుతోంది.
Read Also: Telangana Govt : ఉగాది నుండి సన్నబియ్యం పంపిణీ