KTR : ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారం చుట్టూ ఎలాంటి అనుమానాలు, ఆరోపణలు లేకుండా తానే 100 శాతం నిజాయితీతో వ్యవహరించానని కేటీఆర్ తన ఆరోపణను మళ్లీ పునరుద్ఘాటించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ పథకంలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. “మీరు దమ్ముంటే, లైడిటెక్టర్ పరీక్ష పెట్టండి. నేను అందులో పాల్గొంటాను. ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టి ఈ చర్చ జరిపిద్దాం. ఎవడు దొంగనో, ఎవడో నిజమైన నాయకుడు అనేది ప్రజలు చూసి తేల్చుకుంటారు” అని కేటీఆర్ అన్నారు.
CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
రేవంత్ రెడ్డికి ప్రత్యక్ష సవాల్
కేటీఆర్, రేవంత్ రెడ్డికి పెదవి విరిచిన మాటల్లో మరోసారి ప్రత్యక్ష సవాల్ విసిరారు. “రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ కేసులు, లొట్టపీస్ కేసులు ఎక్కడికైనా తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నారేమో కానీ అవి ఎప్పుడు నిలబడవు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ” పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగనే కనబడ్డట్టు.. రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నింట్లో కూడా దొంగతనం జరుగుతది.. అన్నింట్లో పైసలు తింటరనే దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు కానీ.. నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఏసీబీ విచారణపై కూడా స్పందిస్తూ, “ఏసీబీ వారు అడిగిన పరిశీలన పూర్తి చేసి, జవాబు ఇచ్చాము. మళ్లీ ఎప్పుకు విచారణ కోసం పిలిచినా వస్తాను.. మళ్లీ విచారణకు రావాలని అయితే.. ఇప్పుడ ఏమీ చెప్పలేదు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వివాదం మరింతగా రాజకీయ వేడి పెంచడంతో, కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ఈ సవాల్ మరింత ఉద్రిక్తతతో కొనసాగుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Ravula Sridhar Reddy : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు