Site icon HashtagU Telugu

E Car Race Scam : కేటీఆర్ ఇంటికా..? జైలుకా..? బిఆర్ఎస్ లో టెన్షన్

Ktr Arrest

Ktr Arrest

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఫార్ములా-ఈ కారు రేసు కేసు(E Car Race Scam)లో ఏసీబీ (ACB) విచారణకు హాజరయ్యారు. గురువారం ఆయన తన లాయర్‌తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. హైకోర్టు అనుమతితో లాయర్‌ కార్యాలయంలో ఉండేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. అయితే లాయర్‌కు విచారణ గదిలో జరుగుతున్న సంభాషణలు వినిపించకుండా చర్యలు తీసుకున్నారు. విచారణ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్‌ను కూడా కోర్టు అనుమతించలేదు.

Microsoft: మ‌రోసారి ఉద్యోగుల‌కు షాక్ ఇవ్వ‌నున్న ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ

ముగ్గురు అధికారులు విచారణ

ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్‌ను ప్రశ్నిస్తుంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌ రితిరాజు, ఎస్పీ నరేందర్‌, డీఎస్పీ కలిసి విచారణ చేపట్టారు. ఈ ప్రక్రియలను ఏసీబీ డైరెక్టర్‌ పర్యవేక్షించారు. కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేయడంతో అక్కడ టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

Ex Gratia: బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా: మంత్రి

కేటీఆర్ ను అడగబోయే ప్రశ్నలు ..

స్పాన్సరర్‌ కంపెనీ ఎందుకు తప్పుకొంది? వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది? పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందంలోకి లాగారు? హెచ్‌ఎండీఏ జనరల్‌ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలని ఆదేశించారు? ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదనే విషయం మీకు తెలియదా?’ అనే కోణంలో కేటీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సిన మీరు విదేశీ కంపెనీతో ఒప్పందం ఎలా చేసుకున్నారు? నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా ఎందుకు నివారించలేకపోయారు? అన్న విషయాలపై అర్విందకుమార్‌ వాంగ్మూలం ఆధారంగా అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తుంది.

అర్వింద్‌కుమార్‌ వాంగ్మూలంపై విచారణ

ఈ కేసులో పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఏసీబీ బుధవారం విచారించింది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పలు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. అర్వింద్‌కుమార్‌ వాంగ్మూలం చాలా కీలకంగా మారింది.

విచారణ అనంతరం పరిస్థితి ఏంటి..?

విచారణ తర్వాత కేటీఆర్‌ ఇంటికి తిరిగి వెళతారా లేక అరెస్టవుతారా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సీనియర్‌ అధికారులు విచారణలో సహకరించకపోతే అరెస్టు తప్పదని అంటున్నారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనలు చేపట్టే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Anita Anand : కెనడా ప్రధాని రేసులో మన అనిత.. నేపథ్యం ఇదీ