బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) రేపు గజ్వేల్ ఎమ్మెల్యే (Gajwel MLA)గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలంతా హాజరుకాబోతున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి..అధికారం చేపట్టిన రెండో రోజే కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కింద పడడంతో తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తుంటి ఎముక సర్జరీ అనంతరం ఫామ్ హౌస్ లో ఉంటూ డాక్టర్ల సూచన మేరకు కొద్దీ రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ఈ క్రమంలో కెసిఆర్ ఎమ్మెల్యేగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికలలో కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా తెలంగాణా రాష్ట్ర పాలన సాగించారు. కానీ ఈ దఫా కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం కానున్నారు. గజ్వేల్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఫిబ్రవరి ఒకటవ తేదీన తాను ప్రమాణ స్వీకారం చేస్తానని ఇప్పటికే శాసనసభాపతి అయిన గడ్డం ప్రసాద్ కు లేఖ రాయడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసిన తర్వాత కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడలేదు. కనీసం ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసి ఆ లేటర్ ను గవర్నర్ క ఓస్డీ ద్వారా పంపించారు. అటు తొమ్మిదేండ్ల పాటు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యావాదాలు తెలుపలేదు. ఇటు హుందాగా బీఆర్ఎస్ ఓటమిని ఒప్పుకోలేదు. మొత్తంగా నిశ్శబ్దం లోకి వెళ్లిపోయారు. రేపు ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమైనా మాట్లాడతారా అనేది చూడాలి. ప్రస్తుతం ప్రతిపక్ష బాధ్యత కేటీఆర్ వహిస్తున్నాడు. ఇక ఆ బాధ్యత కేసీఆర్ తీసుకుంటారు కావొచ్చు.
Read Also : Fruits: ఈ పండ్లు తిన్న తర్వాత నీరు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?