Site icon HashtagU Telugu

Bhadrachalam Floods : భారీ వర్షాలకు భద్రాద్రి ఆలయ కల్యాణమండపం నేలమట్టం

Bhadrachalam Ramaiah Temple

Bhadrachalam Ramaiah Temple

గత నాల్గు రోజులుగా ఖమ్మం. కొత్తగూడెం , మహబూబాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు , వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ స్థంభించింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండడం తో రామయ్య (Bhadrachalam Ramaiah Temple) ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. రామాలయం, అన్నదాన సత్రం పరిసరాల్లోకి వరద చేరింది. ఆలయ కొండపై ఉన్న కుసుమ హరినాథబాబా ఆలయ కల్యాణమండపం (Kalyana Mandapam of Harinath Baba Temple) కూలిపోయింది. మండపం కింద కొండను తవ్వడం వల్ల కూలిపోయిందని స్థానికులు అంటున్నారు. 1938లో హరినాధబాబా ఆలయం నిర్మించినట్లు చెపుతున్నారు. ఆలయ పరిసర ప్రాంతంలో సుమారు 35 దుకాణాలకు వరద చేరడంతో సామగ్రి మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

భద్రాద్రి జిల్లా గరిమళ్లపాడులో అత్యధికంగా 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కిన్నెరసాని, తాలిపేరు రిజర్వాయర్లలోకి వరద నీరు చేరడంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. మహబూబాబాద్‌లోని ఉత్తరతాండ పంచాయతీ నేతాజీ తండా పాఠశాల గదులు జలమయమయ్యాయి. డోర్నకల్ శివారు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురంలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 29.9 అడుగులకు చేరుకుంది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. 24 గంటల్లో రాష్ట్రంలోని జోగులాంబ గద్వా ల, భదాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, ములుగు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Read Also : Bhagya Sri : పవన్ కళ్యాణ్ సార్ దేవుడు అనేసిన భాగ్య శ్రీ..!