Kavitha Padayatra : జూన్ 2 (సోమవారం) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజున కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆమె ఎలాంటి ప్రకటన చేస్తారు ? తాను చేపట్టబోయే పాదయాత్ర గురించి ప్రకటిస్తారా ? కొత్త పార్టీ గురించి ప్రకటిస్తారా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్‌లో పూర్తిగా కేటీఆర్ ఆధిపత్యమే కొనసాగుతుండటాన్ని కవిత సహించలేకపోతున్నారు. ఇక తన సొంత బలాన్ని పెంచుకోవాలని కవిత డిసైడయ్యారు.అందులో భాగంగా తొలుత తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేయనున్నారట.
Also Read :NTR Birth Anniversary: ఎన్టీఆర్ నుంచి ప్రేరణ పొందానన్న మోడీ.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
సింగరేణి ప్రాంతంపై కవిత ఫోకస్
కవిత(Kavitha Padayatra) రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా తెలంగాణ జాగృతి, దాని అనుబంధ సంఘాల నెట్‌వర్క్‌ను విస్తరించాలని ఆమె అనుకుంటున్నారు. భవిష్యత్తులో కవిత ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీకి ఈ సంఘాలే ప్రాతిపదికగా నిలుస్తాయి. తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై కవిత తొలుత ఫోకస్ పెట్టబోతున్నారని తెలిసింది. ‘సింగరేణి జాగృతి’ పేరిట కొత్త సంఘానికి కవిత అంకురార్పణ చేశారు. 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను కూడా నియమించారు. కవిత చేపట్టే పాదయాత్రలోనూ సింగరేణి ప్రాంతానికే ప్రయారిటీ ఉంటుందని సమాచారం.
Also Read :Operation Sindoor Logo : ‘ఆపరేషన్ సిందూర్’ లోగో రూపకర్తలు ఎవరో తెలుసా ?
జాగృతి నేతలతో వరుస సమావేశాలు
బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజా పరిణామాలు, జాగృతి తరఫున రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై వారితో చర్చిస్తున్నారు. సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నారు.వివిధ వర్గాల మేధావులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో సంబంధాల బలోపేతానికి కవిత ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు.