Site icon HashtagU Telugu

BRS Silver Jubilee : కేసీఆర్ చేయబోయే కీలక ప్రకటన అదేనా..?

Brs Silver Jubilee Meet At

Brs Silver Jubilee Meet At

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఘట్టానికి వేదికగా మారబోతున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ (BRS Silver Jubilee) రేపు వరంగల్‌లో జరగనుంది. ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సుమారు ఐదు లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా. ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కీలక ప్రసంగం చేయబోతున్నారు. ఈ వేదికపై ఆయన కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించడమే కాకుండా, పార్టీ పరంగా కూడా ఒక భారీ నిర్ణయం ప్రకటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఇప్పటికీ రాజకీయాల్లో ఒక బ్రాండ్‌గా కొనసాగుతుండగా, ఆయన మాటకు తెలంగాణ ప్రజల్లో ఓ ప్రత్యేకమైన విశ్వాసం ఉంది.

Snakes Village : మన దేశంలో పాముల గ్రామం అనే ఓ గ్రామం ఉందని మీకు తెలుసా..?

2001లో బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కేసీఆర్, 2014 నుంచి పదేళ్లపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. విద్యుత్తు, సంక్షేమ రంగాల్లో ఆయన తీసుకున్న చర్యలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువచ్చాయి. అయితే పదేళ్ల పాలనలో ప్రజలకు వచ్చిన అసంతృప్తి, కుటుంబ పాలన ఆరోపణలు, ప్రజాస్వామ్య స్వేచ్ఛపై వచ్చిన విమర్శలు కేసీఆర్ కి మైనస్ అయ్యాయి. పైగా టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం వల్ల ప్రజలలో విదేశీ ఆకాంక్షలపై అనుమానాలు పెరిగాయి. ఈ కారణాలతోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా ఎదురుదెబ్బ తగిలింది.

Pakistan PM: ఉగ్రదాడి.. భారత్‌ను బెదిరించిన పాక్ ప్రధాని!

ఇప్పుడు రేపు జరగబోయే వరంగల్ సభలో కేసీఆర్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. పార్టీకి పునర్జన్మనివ్వాలని, అన్ని వర్గాల ప్రజలకు స్థానం కల్పిస్తూ సమూల మార్పులు తీసుకురావాలని కేసీఆర్ సంకల్పించినట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ ఇకపై కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా మార్పు చూపించేందుకు సిద్ధమయ్యారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా, రేపు వరంగల్ సభలో తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.