హైదరాబాద్ శివారు జన్వాడలో జరిగిన రేవ్ పార్టీ జరగడం.. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పార్టీ లో కేటీఆర్ తో పాటు ఆయన భార్య శైలిమా కూడా ఉన్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. పోలీసు దాడులు జరగగానే శైలిమా పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని.. ఆమె గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుందని సమాచారం. ఈ పార్టీ లో దాదాపు 35 మంది హాజరైనట్లు తెలుస్తుంది.
శనివారం రాత్రి ఈ పార్టీ పై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు, సైబరాబాద్ SOT బృందాలతోపాటు ఎక్సైజ్ పోలీసులు ఫామ్‌హౌస్‌కి వెళ్లి తనిఖీలు చేశారు. అక్కడ హై ఫై పార్టీ జరుగుతున్నట్టు గుర్తించారు. పార్టీలో ఉన్న వారికి డ్రగ్స్ టెస్టు చేస్తే.. విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ వచ్చింది. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
రేవ్ పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యం, గేమింగ్ కాయిన్స్, క్యాసినో మెటీరియల్ గుర్తించారు.. రాజ్‌పాకాలపై NDPS, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీనిపై బిజెపి , కాంగ్రెస్ పార్టీల నేతలు కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. మరి దీనిపై కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో..? నిజంగా ఈ పార్టీ లో కేటీఆర్ తో పాటు ఆయన భార్య శైలిమ ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది.
Raj Part 2
Raj Party1
Read Also : Rave Party : జన్వాడ రేవ్ పార్టీపై కేటీఆర్ సమాధానం చెప్పాలి – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్