Site icon HashtagU Telugu

Kavitha : కవిత‌పై బీఆర్ఎస్ క్రమశిక్షణా చర్యలు.. షోకాజ్ నోటీసు జారీకి రంగం సిద్ధం ?

Brs Show Cause Notice To Kavitha Kcr Ktr

Kavitha : బీఆర్ఎస్‌లో అతి త్వరలోనే షాకింగ్ పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలే గులాబీ బాస్ కేసీఆర్‌కు సంచలన లేఖ రాసినందుకు కల్వకుంట్ల కవితపై చర్యలకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే త్వరలో ఆమెకు బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి షోకాజ్ నోటీసు జారీ అవుతుందని తెలుస్తోంది. కుమార్తె కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం  వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ఎదిరించేలా, ధిక్కరించేలా కవిత రాసిన లేఖను పార్టీ వ్యతిరేక కార్యకలాపంగా పరిగణించాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈక్రమంలోనే కవితపై పార్టీపరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం.

Also Read :Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. ఎన్నో మైనస్ పాయింట్లు

హైదరాబాద్,  ఉమ్మడి వరంగల్ జిల్లాల నేతలు.. 

అయితే బీఆర్ఎస్ నుంచి కవిత(Kavitha)ను నేరుగా సస్పెండ్ చేస్తారా?  లేదంటే చిన్నపాటి క్రమశిక్షణా చర్యలతో సరిపెడతారా ? అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అదే జరిగితే కవిత తన దారిని తాను చూసుకునే అవకాశం ఉంది.ఆమె సొంత రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా అడుగులు వేయొచ్చు.  మొత్తం మీద కవిత  వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో తిప్పలు తప్పవని కేసీఆర్, కేటీఆర్ అనుకుంటున్నారట.ప్రత్యేకించి హైదరాబాద్,  ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన నేతలు కవిత వైఖరిని తప్పుపడుతున్నారట. ఈవిషయాన్ని వారంతా కలిసి కేసీఆర్‌కు తెలియజేసినట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్‌లోని ఒక అగ్ర నేత పురమాయించడం వల్లే.. ఈ నేతలంతా కలిసి కవితకు వ్యతిరేకంగా కేసీఆర్‌కు మొర పెట్టుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

Also Read :Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్ర.. కీలక వివరాలివీ