Site icon HashtagU Telugu

Hyderabad Student: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాదీ విద్యార్థి మృతి

Mohammed Wajid Hyderabad Student Us Govt

Hyderabad Student : హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి మహ్మద్ వాజిద్ (28) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మసాచుసెట్స్‌లో ఉన్న ప్లైమౌత్ కౌంటీలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జనవరి 28న జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

Also Read :Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు‌లో భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్‌

ఘటన జరిగింది ఇలా..

ప్లైమౌత్ కౌంటీ పరిధిలోని ఒక ప్రధాన రోడ్డు కూడలి వద్దకు వాజిద్(Hyderabad Student) నడుపుతున్న కారు అతివేగంగా చేరుకుంది. అక్కడ స్టాప్ సిగ్నల్ ఉన్నా.. అతడు కారును ఆపకుండా డ్రైవింగ్‌ను కొనసాగించాడు. వాజిద్ కారు అతివేగంగా దూసుకెళ్లి, పెద్ద మొత్తంలో ధాన్యపు లోడ్‌తో ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. వెంటనే వాజిద్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయి.

Also Read :TG Govt : విద్యుత్ సామర్థ్యము పెంపులో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు

మహ్మద్ షహబుద్దీన్ ట్వీట్

ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ సెక్రెటరీ మహ్మద్ షహబుద్దీన్ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థి వాజిద్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. గతంలో వాజిద్ ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్‌లో క్రియాశీల కార్యకర్తగా పనిచేసేవాడని గుర్తు చేసుకున్నారు. అమెరికాలోని ఎన్‌ఆర్ఐ మైనారిటీ కాంగ్రెస్ కమిటీలోనూ వాజిద్ సభ్యుడిగా వ్యవహరించాడని మహ్మద్ షహబుద్దీన్ గుర్తు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో వాజిద్ దిగిన ఒక ఫొటోను ఆయన తన ట్వీట్‌లో జతపరిచారు.

Also Read :Convoy Accident : ఏపీలో కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు ప్రమాదం

విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో..

కొంతమంది విదేశీ విద్యార్థులు వీసాల గడువు ముగిసినా అమెరికాలో అక్రమంగా ఉంటున్నారు. అలాంటి వారిపై ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. “వలస చట్టాల అమలును పునరుద్ధరించడం” పై అమెరికా హౌస్‌ కమిటీ విచారణ చేపట్టింది.  ఈ కమిటీకి చట్టసభ సభ్యులు పలు కీలక సూచనలు చేశారు. ‘‘2023 సంవత్సరంలో వీసా గడువు ముగిసినా 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్లు అమెరికాలోనే ఉండిపోయారు’’ అని కమిటీకి పలువురు తెలిపారు. దాదాపు 32 దేశాలకు చెందిన విద్యార్థులు,స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్లలో 20 శాతం మందికిపైగా వీసా గడువు ముగిసినా అమెరికాను వీడలేదని పలువురు కమిటీకి తెలియజేశారు. ఎఫ్‌ (F),ఎం(M)కేటగిరీల్లో వీసాలు పొందినవారే ఎక్కువగా ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది.