హైదరాబాద్‌లో చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నగరంలో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్.. అంతకంటే తక్కువ నమోదవుతోంది. వారాంతం వరకు చలిగాలులు తగ్గే అవకాశం లేదు. భారత వాతావరణశాఖ హైదరాబాద్‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్ర రాజధాని అంతటా చల్లనిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. . ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. నవంబర్‌లో నగరంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 19.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అయితే గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే పడిపోతున్నాయి. గురువారం కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో మల్కాజిగిరిలో ఉష్ణోగ్రతలు 13.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి, ఆ తర్వాత రాజేంద్రనగర్ (13.7 డిగ్రీల సెల్సియస్), సికింద్రాబాద్ (14.4 డిగ్రీల సెల్సియస్), సరూర్‌నగర్ (14.8 డిగ్రీల సెల్సియస్), హైదరాబాద్‌లో సాధారణంగా 15 డిగ్రీలు. సెల్సియస్‌గా నమోదైయ్యాయి.
Winter: హైదరాబాద్ నగరవాసులను వణికిస్తున్న చలి.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
హైదరాబాద్‌లో చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నగరంలో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 15..

Winter Imresizer
Last Updated: 09 Nov 2022, 09:40 PM IST