TRS పార్టీ మాదే..కవిత పార్టీకు మరో బిగ్ షాక్ ..ఈసీ ట్విస్ట్

కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)కు ఆరంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరు చుట్టూ తీవ్ర వివాదం నెలకొనడంతో, ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘టీఆర్ఎస్’ అనే పేరును ఇతరులకు కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) పలు వైపుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ వివాదంలో ప్రధానంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘టీఆర్ఎస్’ అనే పేరు 14 ఏళ్ల […]

Published By: HashtagU Telugu Desk
kalvakuntla Kavitha Party Name TRS

kalvakuntla Kavitha Party Name TRS

కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)కు ఆరంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరు చుట్టూ తీవ్ర వివాదం నెలకొనడంతో, ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘టీఆర్ఎస్’ అనే పేరును ఇతరులకు కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) పలు వైపుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి.

ఈ వివాదంలో ప్రధానంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘టీఆర్ఎస్’ అనే పేరు 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రతో, ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ తమ పార్టీని ప్రజలు ‘టీఆర్ఎస్’గానే గుర్తిస్తున్నారని, కాబట్టి ఆ పేరును వేరొకరికి కేటాయించవద్దని కోరుతూ ఈసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.

మరోవైపు, కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన ‘తెలంగాణ రాష్ట్రసామాజిక సేన’ అనే సంస్థ కూడా ‘టీఆర్ఎస్’ అనే పేరు కోసం ఈసీకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ ఈ మేరకు దరఖాస్తు చేసినట్లు తెలియవచ్చింది.

ఇవి మాత్రమే కాకుండా, కవిత పత్రికల్లో ఇచ్చిన ప్రకటన ఆధారంగా సుమారు 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు ఈసీకి అందినట్లు సమాచారం. అదే సమయంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే ‘తెలంగాణ రాజ్య సమితి’ పేరుతో నమోదైన మరో పార్టీ కూడా ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామాన్ని వాడటంపై అభ్యంతరం తెలుపుతూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో, తమ వాదనలు వినిపించేందుకు కవిత ప్రతినిధుల బృందం త్వరలో ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్ధమవుతోంది. ఒకే పేరుపై ఇన్ని వైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో కవిత తన కొత్త పార్టీకి ‘టీఆర్ఎస్’ పేరును దక్కించుకుంటారా లేదా అన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

  Last Updated: 11 Jun 2026, 04:07 PM IST