Illegal Autism Centres : వయసుకు తగ్గట్టుగా పిల్లల్లో మానసిక ఎదుగుదల లేకపోవడాన్ని ‘ఆటిజం’ అంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలకు ఆటిజం థెరపీ కేంద్రాలలో థెరపీ చేస్తుంటారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నకిలీ ఆటిజం థెరపీ కేంద్రాలు యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆటిజంతో బాధపడుతున్న పిల్లల అవసరాన్ని అవి సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక్కో థెరపీ సెషనుకు పిల్లల పేరెంట్స్ నుంచి రూ.1500 దాకా వసూలు చేస్తున్నారు. ఆటిజం థెరపీ కేంద్రాలలో నిపుణుల ఆధ్వర్యంలో థెరపీ చేయాలి. కానీ అలా జరగడం లేదు. కూకట్‌పల్లి, సుచిత్ర, బీకే గూడ, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో నకిలీ ఆటిజం థెరపీ సెంటర్లను ఏర్పాటు చేసుకొని దందా చేస్తున్నారు.
Also Read :Lord Krishna Incarnation : కేజ్రీవాల్ శ్రీకృష్ణుడి అవతారం.. ఎందుకో వివరించిన అవధ్ ఓఝా
ఆటిజం థెరపీ చేసే కేంద్రాలు ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్(Illegal Autism Centres) చేసుకోవాలి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ థెరపీ జరగాలి. కానీ ఇంటర్, డిగ్రీ చదివిన వారికి అరకొరగా ట్రైనింగ్ ఇచ్చి థెరపిస్టులుగా నియమిస్తున్నారు. కొందరు ఒక ఆటిజం థెరపీ కేంద్రానికి రిజిస్ట్రేషన్ చేయించి.. అనుమతులు తీసుకోకుండానే ఇతర ప్రాంతాల్లో వాటి బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. వారానికి నాలుగైదు ఆటిజం థెరపీ సెషన్లు చేసి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి కేంద్రాలపై అధికారులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.
Also Read :Allu Arjun: కొనసాగుతున్న విచారణ.. ఆ విషయంలో తప్పు ఒప్పుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!
పిల్లల్లో ఆటిజం లక్షణాలను గుర్తించిన వెంటనే బిహేవియరల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి చికిత్సలు చేస్తుంటారు. ఈ సమస్యలను ఎదుర్కొనే పిల్లలు ఇతరులతో కలవలేరు, మాట్లాడలేరు. ఇతరులు చెప్పిన విషయాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బందిపడతారు. మనం ఏది చెబితే తిరిగి అదే చెబుతుంటారు. ఆటిజం బారినపడే పిల్లలు హైపర్ యాక్టివ్ డిజార్డర్‌తో సతమతం అవుతుంటారు.