Site icon HashtagU Telugu

Pocharam Municipality : హైడ్రా కూల్చివేత‌లు..ఆనందంలో ప్రజలు

Pocharam Municipality Hydra

Pocharam Municipality Hydra

రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీ(Pocharam Municipality)లో దివ్యనగర్ లేఔట్ చుట్టూ నిర్మించిన అక్రమ ప్రహరీని శనివారం హైడ్రా అధికారులు (Hydraa) కూల్చివేశారు. ఈ ప్రహరీ వల్ల పలు కాలనీలకు వెళ్లే మార్గాలు మూసివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటూవస్తున్నారు. ఈ క్రమంలో కాలనీ వాసులు హైడ్రా కు ఫిర్యాదులు చేయడంతో..అధికారులు పరిశీలించి ఈరోజు కూల్చివేతలు మొదలుపెట్టారు.

Trump Effect : పార్ట్ టైమ్ జాబ్స్ మానేస్తున్న భారతీయ విద్యార్థులు

దివ్యనగర్ లేఔట్ చుట్టూ అక్రమంగా ప్రహరీ నిర్మించి గేట్లు ఏర్పాటు చేయడంతో, పక్కన ఉన్న ఇతర లేఔట్లకు వెళ్లే మార్గాలు నిలిచిపోయాయి. ప్లాట్ల యజమానులు తమ ప్లాట్లను చూడటానికి, అమ్మకానికి అనుమతించకుండా నల్లమల్లారెడ్డి నియంత్రణ కొనసాగించారని స్థానికులు ఆరోపించారు. ఫిర్యాదుల ఆధారంగా కమిషనర్ ఇరు పక్షాలను వినిపించి, ప్రహరీ నిర్మాణానికి అనుమతులు లేవని నిర్ధారించారు. ప్రహరీ కూల్చివేత ఆదేశాల అనంతరం శనివారం అధికారులు విస్తృతంగా చర్యలు చేపట్టారు. దివ్యనగర్ లేఔట్ చుట్టూ ఉన్న ప్రహరీ తొలగించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చర్యతో పలు కాలనీలకు, లేఔట్లకు మార్గం సుగమమైంది. ఏకశిలా లేఔట్, వెంకటాద్రి టౌన్‌షిప్, సుప్రభాత్ వెంచర్, ముత్తెల్లిగూడ వంటి ప్రాంతాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Vishal : విశాల్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబర్స్ పై కేసు నమోదు..

నల్లమల్లారెడ్డి తమను బెదిరించి డెవలప్‌మెంట్ ఛార్జీల పేరుతో డబ్బు వసూలు చేశారంటూ ప్లాట్ల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లేఔట్ చుట్టూ అక్రమ ప్రహరీతో పాటు సర్వే నంబర్ 66లో ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారని స్థానికులు ఆరోపించారు. ఈ ఆరోపణలతో నల్లమల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రహరీ కూల్చివేత అనంతరం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ సమస్యలపై స్పందించిన కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.