Site icon HashtagU Telugu

HYDRA Big Shock to Murali Mohan : మురళీమోహన్ కు షాక్ ఇచ్చిన హైడ్రా..

Hydra Muralimohan

Hydra Muralimohan

HYDRA Big Shock to Murali Mohan : హైదరాబాద్ నగరంలో ‘హైడ్రా’ (HYDRA ) బుల్డోజర్లు హడలెత్తిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు అని పిర్యాదు అందితే చాలు వెంటనే ఆ నిర్మాణాల ఇంటి ముందు బుల్డోజర్లు అడుగుపెడుతున్నాయి. నోటీసులు వంటివి ఏమి లేకుండా కూల్చేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తూ వస్తుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో నిర్మాణాల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.

జయభేరి సంస్థ(Jayabheri Constructions)కు నోటీసులు

తాజాగా నటుడు మురళీమోహన్ ( Murali Mohan) కు చెందిన జయభేరి సంస్థ(Jayabheri Constructions)కు నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (Gachibowli Financial District) లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం భగీరథమ్మ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణ వ్యర్ధాలను వేయడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటె హైడ్రాను HMDA వరకు విస్తరించి, 3 జోన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ను సెంట్రల్‌ జోన్‌గా సైబరాబాద్‌ను నార్త్‌ జోన్‌గా, రాచకొండను సౌత్‌జోన్‌గా విభజించనుంది. వాటికి జోనల్‌ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఆ మూడు జోన్లను చీఫ్‌ కమిషనర్‌ పర్యవేక్షిస్తారని ప్రభుత్వం తెలిపింది.

Read Also : C.V. Anand Returns : హైదరాబాద్ సీపీగా మరోసారి సీవీ ఆనంద్