Site icon HashtagU Telugu

Fire Break : హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ కారణంగా

Fire Accident

Fire Accident

Fire Break : హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లోని క్రిష్ ఇన్ రెస్టారెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ప్రమాదం జరగడంతో, పై అంతస్తుల్లో ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఫైర్ సిబ్బంది చాకచక్యంతో మంటలు పైకెగరకుండా నిరోధించారు. భవనంలోని వారిని సురక్షితంగా బయటకు తరలించి ప్రమాదం నివారించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

CM Chandrababu : తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ వ్యతిరేకించలేదు – చంద్రబాబు

ఇటీవల హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు కలవరపెడుతున్నాయి. అపార్ట్‌మెంట్లు, ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్ వంటి పెద్ద భవనాల్లో కనీస ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు లేకపోవడం వల్ల ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. నాణ్యతలేని ఎలక్ట్రికల్ వైరింగ్, అవసరమైన ఎర్తింగ్ లేకపోవడం, ఆటోమెటిక్ ట్రిప్ స్విచ్‌లు లేకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్‌లు ఎక్కువవుతున్నాయి. ఎలక్ట్రికల్ ఎక్స్‌పర్ట్స్ సూచనల మేరకు, ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి ఇంటీర్నల్ వైరింగ్‌ను తిరిగి వేయించుకోవాలని, 10 కేవీఏ కన్నా ఎక్కువ లోడ్ ఉన్న భవనాలకు సరిపడా ఎర్తింగ్ అమర్చాలని సూచిస్తున్నారు. చిన్న ఖర్చుతో తప్పించుకోవాలనే ఆలోచన వల్లే పెద్ద ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Dalai Lama : వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది : భారత్‌