BluJ Aerospace : విమానం నిలువునా నింగిలోకి, నేలపైకి.. హైదరాబాద్ స్టార్టప్ తడాఖా

‘వీటీఓఎల్‌’ టెక్నాలజీతో మనిషి లేకుండానే ఆటోమేటిక్‌గా నడిచే సరుకు రవాణా విమానాన్ని మన హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్లూజే ఏరోస్పేస్‌(BluJ Aerospace) కంపెనీ ఆవిష్కరించింది.

Published By: HashtagU Telugu Desk
Hyderabad Bluj Aerospace Evtol Green Aircraft

BluJ Aerospace : ఆ విమానం నిట్ట నిలువునా నింగిలోకి టేకాఫ్‌ కాగలదు. నిట్ట నిలువునా భూమిపైకి ల్యాండింగ్ కాగలదు. విమానానికి ఉండే ఈ తరహా సామర్థ్యాన్ని సాంకేతిక భాషలో ‘వీటీఓఎల్‌’ అంటారు. ‘వీటీఓఎల్‌’ టెక్నాలజీతో మనిషి లేకుండానే ఆటోమేటిక్‌గా నడిచే సరుకు రవాణా విమానాన్ని మన హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్లూజే ఏరోస్పేస్‌(BluJ Aerospace) కంపెనీ ఆవిష్కరించింది. ఈ విమానం పనితీరును హైదరాబాద్‌ సమీపంలోని నాదర్‌గుల్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ విమానాలను తాము 2026 సంవత్సరం నుంచి విక్రయిస్తామని బ్లూజే ఏరోస్పేస్ కంపెనీ వెల్లడించింది.

Also Read :Chinese Troops : దెప్సాంగ్, డెమ్‌చోక్‌ నుంచి చైనా బ్యాక్.. శాటిలైట్ ఫొటోలివీ

  • 100 కిలోల బరువును 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం బ్లూజే ఏరోస్పేస్‌ ‘వీటీఓఎల్‌’ విమానం సొంతం.
  • ఈ విమానం 150 కి.మీ దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకోగలదు.
  • విపత్తు సమయాల్లో రెస్క్యూ వర్క్స్ కోసం, మారుమూల ప్రాంతాల్లోని సైన్యానికి, భద్రతా బలగాలకు ఆయుధ సామగ్రిని తరలించేందుకు ఈ విమానం బాగా ఉపయోగపడుతుంది.
  • హైడ్రోజన్‌తో పాటు విద్యుత్‌తో నడిచే ‘వీటీఓఎల్‌’ విమానాన్ని 2026 నాటికి అందుబాటులోకి తెస్తామని బ్లూజే ఏరోస్పేస్‌ అంటోంది.
  • ఈ విమానాల ద్వారా మన దేశంలో విమానాశ్రయాలు లేని ప్రాంతాలకు కూడా విమాన సేవలను నడపొచ్చని అంటోంది.

Also Read :Israel Vs Iran : ఇరాన్‌‌పై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు

బ్లూజే ఏరోస్పేస్‌ కంపెనీ హైదరాబాద్‌ కేంద్రంగా 2022లో ప్రారంభమైంది. ఈ కంపెనీ ఇప్పటి వరకు రూ.18 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన సంస్థల జాబితాలో ఎండియా క్యాపిటల్, ఐడియాస్ప్రింగ్‌ క్యాపిటల్, రైన్‌మ్యాటర్‌ క్యాపిటల్, జెరోధా ఉన్నాయి. రెండు,మూడేళ్లలో సిరీస్‌ ఏ ఫండింగ్‌ ద్వారా రూ.250 కోట్లను సమకూర్చుకునేందుకు బ్లూజే ఏరోస్పేస్ ప్రయత్నిస్తోంది. భారతదేశ రక్షణ రంగానికి, సైన్యానికి ఉపయోగపడేలా ఒక ప్రత్యేక విమానాన్ని తయారు చేస్తామని ఈ కంపెనీ వ్యవస్థాపకులు అంటున్నారు.

Also Read :New Maruti Suzuki Dzire: మారుతీ నుంచి మ‌రో కొత్త కారు.. మైలేజ్ 32కిమీ!

  Last Updated: 26 Oct 2024, 10:41 AM IST