Beach in Hyderabad : భాగ్యనగర ప్రజలకు, పర్యాటకులకు ఓ సంతోషకరమైన శుభవార్త. ఇకపై సముద్రపు అలల సవ్వడి వినాలన్నా, ఇసుక తిన్నెలపై నడవాలన్నా ఆంధ్రప్రదేశ్, గోవా లేదా తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఆ ప్రత్యేకమైన అనుభూతిని హైదరాబాద్ నగరంలోనే ఆస్వాదించే అవకాశం రాబోతోంది. భూపరివేష్టిత రాష్ట్రంగా ఉండటంతో సముద్ర తీరాల లేని లోటు ఎప్పటినుంచో తెలంగాణ పర్యాటక రంగంలో కనిపిస్తూనే ఉంది. ఆ లోటును తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రూపొందించింది.
Bigboss : ఛాన్స్‌ల కోసం పడుకున్నా తప్పులేదంటున్న బిగ్ బాస్ బ్యూటీ
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడలో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ కృత్రిమ సముద్ర తీరాన్ని (ఆర్టిఫిషియల్ బీచ్) అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.225 కోట్ల భారీ నిధులు కేటాయించింది. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP మోడల్) చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ బీచ్ ప్రాజెక్టు కేవలం ఇసుక తిన్నెలు, అలలతోనే పరిమితం కాకుండా పర్యాటకులను ఆకట్టుకునే అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. చిన్నారుల కోసం ఆట స్థలాలు, యువత కోసం వాటర్ స్పోర్ట్స్, వినోద కార్యక్రమాలు, పెద్దలు విశ్రాంతి తీసుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం అన్నీ ఒకే కాన్సెప్ట్‌లోగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది.
పెద్ద సరస్సు, వేవ్ పూల్స్, ఫౌంటెన్లు, లగ్జరీ హోటళ్లు, ఫ్లోటింగ్ విల్లాలు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు, సైక్లింగ్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రైల్‌లు ఈ సౌకర్యాలన్నీ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ ఇప్పటికే చారిత్రక కట్టడాలు, మ్యూజియంలు, సరస్సులు, పార్కులు, పుణ్యక్షేత్రాలతో దేశీ, విదేశీ పర్యాటకులను విస్తృతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు రాబోయే ఈ ఆర్టిఫిషియల్ బీచ్‌తో నగరం పర్యాటక రంగంలో కొత్త మైలురాయిని చేరుకోనుంది. వారాంతాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో విహరించేందుకు ఒక ప్రత్యేక కేంద్రంగా మారబోతోంది. అంతేకాదు, హైదరాబాద్‌కు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులందరికీ ఈ బీచ్ “must visit spot”గా నిలవనుందని అధికారులు విశ్వసిస్తున్నారు.
AP News: నేడు నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఎక్స్ వేదికగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్