HCA President: టీమిండియా ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బిజీగా ఉంది. ఈరోజు నుంచి ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రేపు బంగ్లాదేశ్‌తో పోటీపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న భారత్ పాక్‌తో తలపడనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించనుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లు ఎప్పటిలాగే హైదరాబాద్‌లో కూడా జరగనున్నాయి. ఈసారి తొమ్మిది ఐపీఎల్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 23న జరగనుంది. అయితే ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలగకుండా హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అని రకాల ఏర్పాట్లు చేస్తోంది.
Also Read: Delhi Chief Minister: వీడిన ఉత్కంఠ.. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా!
అయితే ఉప్పల్ స్టేడియంలోని ఏర్పాట్లపై హెచ్‌సీఏ అధ్యక్షులు (HCA President) జగన్ మోహన్ రావు పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ అనేది మాకు ఒక పండగ వాతావరణం లాంటిది. పెళ్లితో పాటు సమానంగా ఐపీఎల్‌ను ట్రీట్ చేస్తాం. పెళ్లికి ముందు ఏవైతే ఏర్పాట్లు చేస్తామో, ఐపీఎల్‌కు కూడా అలాంటి ఏర్పాట్లే చేస్తాం. ఉప్పల్ స్టేడియంలో ఉన్న పెండింగ్ పనులన్నీ మొదలుపెట్టాం. అయితే ఈసారి గతంలో మాదిరిగా కాకుండా రెండు మ్యాచ్‌లు ఎక్కువ రావడం జరిగింది. తొమ్మిద మ్యాచ్‌లు ఈసారి జరగనున్నాయి. మార్చి 15 కల్లా ఉప్పల్ స్టేడియాన్ని ఐపీఎల్ మ్యాచ్‌కు అన్ని రకాల హంగులతో అందుబాటులో ఉంచుతాం. మార్చి 20వరకు డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఏమైనా చిన్న పనులు ఉన్నా సరే వాటిని మార్చి 20లోపు క్లియర్ చేస్తాం. మార్చి 23కి మనకు ఫస్ట్ మ్యాచ్ ఉంది. అప్పటివరకు స్టేడియంలో అన్ని రకాల ఏర్పాట్లను చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అలాగే తాను అధ్యక్ష పదవి చేపట్టిన సమయం నుంచి ఇప్పటివరకు ఒక విమర్శ కూడా తమపై రాలేదని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు వచ్చే క్రికెట్ అభిమానులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం క్రింది వీడియో చూడండి.