Harish Rao : శుక్రవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం అయ్యాక మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను ఏమార్చరని హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామన్నారని, ఇప్పుడేమో ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది బడ్జెట్ రూ.2 లక్షల 91 వేల 159 కోట్లు అని గొప్పగా చెప్పుకున్నారు. ఇవి అవాస్తవిక అంచనాలని నేను ఆనాడే చెప్పాను. వారు కాదు పొమ్మన్నరు. రివైజ్డ్ ఎస్టిమేషన్‌లో రూ.27 వేల కోట్లు తక్కువ చేసి చూపారు. ముఖ్యమంత్రేమో రూ.60 నుంచి రూ.70 వేల కోట్లు తక్కువగా వస్తాయని స్వయంగా చెప్పారు. అంటే అంచనా అవాస్తవం అని తేలిపోయింది.
Read Also: Shardul Thakur: లక్నో జట్టులోకి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్?
గతంలో రుణమాఫీకి రూ.31 వేల కోట్లు సమీకరించుకున్నట్లు చెప్పారని, రూ.20 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు. నేను భట్టి గారిని సూటిగా అడుగుతున్నా. మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వీఎల్‌ఆర్ వర్తిస్తుంది అనే ఉత్తర్వులు ఉంటే చూపండి. లేదా ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసిందనందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసింది లేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేం ఇచ్చిన 5లక్షలకు మించి పెంచింది లేదు. ఇదే శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా 5లక్షల వరకే వడ్డీ అందుతుందని ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. 5లక్షల వరకే వడ్డీ లేని రుణాలు అని మీరే అన్నరు. మళ్లీ మీరే తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం అని ప్రచారం చేసుకుంటున్నరు.
ఈ సారి ప్రసంగంలో రూ.లక్ష మాయమైంది. దళిత, గిరిజనులను ప్రభుత్వం మోసం చేశారు. ఫసల్ బీమాకు రూపాయి ఇవ్వలేదని, ఫసల్ బీమా చేయట్లేదు. జాబ్ క్యాలెండర్.. జాబ్‌లెస్ క్యాలండర్ అయింది. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగానికి మా ప్రభుత్వ హయాంలో అనుమతులు తెచ్చామన్నారు. భూసేకరణకు రూ.1,525 కోట్లు పెట్టామని గత బడ్జెట్‌లో చెప్పారు. ఏడాదైనా ఒక్క ఎకరా సేకరింలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని గత బడ్జెట్‌లో చెప్పారు, ఎన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి.. ఎంత ఆయకట్టుకు నీళ్లిచ్చారో చెప్పాలి. రైతుబంధు కింద ఎకరానికి రూ.15 వేలు చెల్లిస్తామన్న సంకల్పం ఏమైంది. రైతులు, కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కౌలు రైతులను రైతులే చూసుకోవాలంటున్నారు. ఈసారి బడ్జెట్‌లో అసలు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. మహిళా సంఘాలకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టుకూలీ రూ.50 నుంచి రూ.75కు పెంచి ఇచ్చినట్లు చెప్పారు. రూ.75 కుట్టు కూలీ ఇచ్చిన మహిళా సంఘం పేరు చెప్పాలని లేకపోతే క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఇండ్లకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 4.5 లక్షల ఇండ్లు కాదు కాదా.. 4 ఇండ్లు కూడా కట్టలేదు. ఎస్సీ, ఎస్టీల ఇండ్లకు రూ.లక్ష అదనంగా కలిపి రూ.6 లక్షలు ఇస్తామని హరీశ్‌రావు అన్నారు.