Hajj Yatra 2025 : హజ్ యాత్ర-2025ను జెండా ఊపి హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ హుస్రూ పాషా ప్రారంభించారు. నాంపల్లి హజ్ హౌస్ నుంచి ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మొదటి విడతగా హజ్ యాత్రకు 292 మంది వెళుతున్నారు. హజ్ హౌస్ నుంచి 9 బస్సుల్లో ముస్లింలు శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే భారత హజ్ కమిటీ యాత్రికులకు మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని సమయాల్లో తప్పనిసరిగా నుసుక్ కార్డ్‌ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. దీంతో పాటు ముఖ్యమైన పత్రాలు, గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలని చెప్పింది.
Read Also: TTD : శ్రీవారి స్వచ్ఛంద సేవలు పలు మార్పులు..ఈ నెల 30న కోటా విడుదల
భారత హజ్ కమిటీ అధికారిక లెక్కల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్ నుంచి సుమారు 16వేల మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారు. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని యాత్రికులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మిగతవారు లఖ్‌నవూ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు. ఇక, యాత్రికుల సౌకర్యం కోసం హజ్ సువిధ 2.0 అనే యాప్‌ను రూపొందించామని, దీనిని గూగుల్, యాపిల్ ప్లో స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పింది. ఇందులో విమానంలోని సౌకర్యాలతో పాటు వీసా సంబంధిత వివరాలు ఉంటాయని తెలిపింది. దీంతో పాటు మక్కాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్, జీపీఎస్, ప్రార్థనా సమయం, ఫిర్యాదులు, బ్యాగేజీ ట్రాకింగ్ లాంటి వివరాలు ఉంటాయని భారత హజ్ కమిటీ వెల్లడించింది.
కాగా, నుసుక్ కార్డ్ యాత్రికుల వద్ద లేకపోతే సౌదీ అరేబియా ప్రభుత్వం నిలిపివేస్తుంది. మక్కా, మదీనా, మీనా, అరాఫత్ స్థానిక అధికారులు యాత్రికులను అడ్డుకుంటారు. ఇలాంటి ఇబ్బందులు పడకూడదంటే తప్పనిసరిగా నుసుక్ కార్డ్‌ను తమ వద్దే ఉంచుకోవాలని సూచించారు. హజ్‌లో ఉన్నవారు తమ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి, పాత పాపాలను తుడిచిపెట్టుకోవడానికి మరియు కొత్తగా ప్రారంభించడానికి ఒక అవకాశంగా తీర్థయాత్రను భావిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటైన హజ్ ఇస్లాం యొక్క ఐదు స్తంభాలలో ఒకటి. శారీరకంగా మరియు ఆర్థికంగా అలా చేయగలిగితే అన్ని ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా దీనిని చేపట్టాలి అని అనుకుంటారు.
Read Also: Indiramma Houses Scheme : మాట మార్చిన ప్రభుత్వం..లబ్ధిదారులు ఆందోళన