Site icon HashtagU Telugu

Mastan Sai : మస్తాన్ సాయి కేసులో రోజుకో మలుపు.. తాజాగా ఆడియో సంచలనం

Mastan Sai

Mastan Sai

Mastan Sai : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుంటూరు మస్తాన్ సాయి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు విచారణలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో ఆడియో రికార్డు బయటకు వచ్చి చర్చనీయాంశంగా మారింది. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి పై  లావణ్య పెట్టిన ఫిర్యాదులో పోలీసులు బేరసారాలు చేసుకున్నట్లు ఈ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.

తాజాగా లీకైన ఆడియో ప్రకారం, మస్తాన్ సాయి, అతని తండ్రి, పోలీసులతో ఛార్జ్ షీట్ విషయంలో బేరమాడినట్లు తెలుస్తోంది. తమకు అనుకూలంగా ఛార్జ్ షీట్ రూపొందిస్తే, పోలీసులకు డబ్బు ఇస్తామని మస్తాన్ సాయి తండ్రి చెప్పినట్టు ఈ ఆడియోలో ఉన్నట్లు సమాచారం. దీనితో, కేసు విచారణపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇంతకుముందు లావణ్య ఇచ్చిన ఫిర్యాదును కాకుండా తమకు అనుకూలంగా మారుస్తూ పోలీసులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినట్లు ఈ ఆడియో బహిరంగమైంది. ఈ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పోలీసు శాఖ ఎలాంటి స్పందన ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

గతంలో హార్డ్ డిస్క్, యువతుల వీడియోలు చుట్టూ తిరిగిన ఈ కేసు, తాజాగా డ్రగ్స్ మాఫియా వైపు మలుపు తీసుకుంది. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీలపై విచారణ చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. పోలీసుల విచారణలో మస్తాన్ సాయి, అతని మిత్రుడు రాహుల్ కొంతమంది యువతులను పార్టీలకు ఆహ్వానించి, వారికి తెలియకుండా డ్రగ్స్ ఇచ్చి, వీడియోలు రికార్డు చేసినట్లు బయటపడింది. ఈ డ్రగ్స్ పార్టీలకు సంబంధించిన వీడియోల ఆధారంగా, పోలీసులు ఇప్పటికే రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Supreme Court : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌.. మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు
కేసులో ఇప్పటికే మస్తాన్ సాయి, ఖాజా అనే వ్యక్తులను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఖాజాను విచారించి, 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. అయితే కేసు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో పోలీసుల పాత్ర కూడా అనుమానాస్పదంగా మారింది. ఛార్జ్ షీట్‌లో మార్పులు చేసేందుకు బేరసారాలు జరిపినట్లు బయటపడటంతో, విచారణ పద్ధతిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మస్తాన్ సాయి వ్యవహారంలో డ్రగ్స్, యువతుల లైంగిక దోపిడీ, పోలీసుల ప్రమేయం వంటి అంశాలు కలసి నాగరిక సమాజానికి మాయని మచ్చగా మారాయి.

కేసు పరిణామాలు – ఏమి జరుగబోతోంది?
మస్తాన్ సాయి పై ఉన్న కేసుల్లో కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులతో బేరసారాలు జరిపిన ఆడియో బయటపడటంతో, విచారణకు కొత్త దిశ లభించింది. డ్రగ్స్ మాఫియాలో మస్తాన్ సాయి పాత్ర పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. యువతుల వ్యక్తిగత వీడియోలు రహస్యంగా చిత్రీకరించడం, మత్తు పదార్థాల సరఫరా వంటి అంశాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ కేసు ఇంకా ఎన్ని సంచలన విషయాలను బయటకు తెచ్చే అవకాశం ఉందో చూడాలి. మస్తాన్ సాయి, అతని నెట్వర్క్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Viral Video: ‘ఆటగదరా శివ’.. ఓ యువతి మరణానికి వేదికైన పెళ్లి వేడుక..