TGPSC : తెలంగాణ గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు (Group 2 Results) టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. గ్రూప్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవాలని టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం సూచించారు. ఎలాంటి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయకుండా అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 గ్రూప్ 2 పోస్టులు 2024 డిసెంబర్ 15, 16 తేదీలలో పరీక్ష నిర్వహించారు. గ్రూప్ అభ్యర్థుల మార్కులను, జనరల్ ర్యాంకు జాబితాను తాజాగా టీజీపీఎస్సీ ప్రకటించింది. https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Read Also: Dalai Lama Vs China: భారత్‌లో నా వారసుడు.. దలైలామా ప్రకటన.. చైనా భగ్గు
783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 15,16న జరిగిన ఈ పరీక్షలను సుమారు 2.5లక్షల మంది రాశారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. కాగా, టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. అలాగే డిసెంబరు 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్షను ,మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 పరీక్ష నిర్వహించింది.
Read Also: Tariff Cuts : అమెరికా సుంకాల తగ్గింపు పై భారత్ క్లారీటీ