Telangana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఒకేసారి 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ లలో 55, బీహార్ లో 49, మహారాష్ట్రలో 44, బెంగాల్ లో 37, మధ్యప్రదేశ్ లో 34, అసోంలో 32, ఒడిశాలో 25, పంజాబ్ లో 22, గుజరాత్, తెలంగాణలలో 21, జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో 18, హర్యానాలో 15, కర్ణాటకలో 13 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొత్తం 1309 రైల్వే స్టేషన్ల రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇక ఆయా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనుల కోసం మోదీ ప్రభుత్వం మొత్తం 24,470 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.
ఈ పథకంలో భాగంగా నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తుండగా.. పనులను ప్రారంభించే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై మాట్లాడారు. సామాన్యుల కోసమే కొత్తగా రైల్వే స్టేషన్లను ప్రధాని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. దీనికోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మంచి రైల్వే వ్యవస్థ ఉంటే విద్యార్థులు, రోగులు, వృద్ధుల ప్రయాణం సురక్షితంగా, సౌకర్యంగా ఉంటుందని ఆమె తెలిపారు. నాంపల్లి ఆధునీకరణకు నిధులు కేటాయించినందుకు మోదీకి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇకపై తెలంగాణాలో ఎక్కడికి వెళ్లాలన్న రైలు మార్గం మీదనే వెళ్తానని చెప్పారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.
Also Read: 508 Stations-PM Modi : 27 రాష్ట్రాల్లో 508 రైల్వే స్టేషన్ల మోడర్నైజేషన్.. ప్రధాని మోడీ శంకుస్థాపన