Site icon HashtagU Telugu

GHMC : ఒక్కసారిగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా

Ghmc

Ghmc

GHMC : హైదరాబాద్ మహనగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు గురువారం ఉదయం మెరుపు ధర్నాకు దిగారు. పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలు రూ. 1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఓ కాంట్రాక్టర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పూనుకొన్నాడు. ఇతర కాంట్రాక్టర్లు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల బాధతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత కాలంలో, రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత హామీలను అమలు చేయాలని చూస్తున్నాయి. అయితే, ఈ ఉచిత హామీల అమలుతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ‘మహలక్ష్మీ పథకం’ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందజేసే కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఇదే విధంగా కర్ణాటకలోనూ ‘శక్తి పథకం’ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి ప్రభుత్వానికి కోటి రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటనలో ఆ ఇద్దర్ని సస్పెండ్ చేసిన సీఎం

తెలంగాణలో కూడా ఉచిత పథకాలను క్రమంగా ప్రవేశపెట్టిన పార్టీలు, ఇకపుడు ప్రభుత్వం ఖజానాకు నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో సరిగా పనులు జరగడం కష్టమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నగరంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వీధి దీపాలు వెలగకుండా పోవడంపై జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించగా, వారు వీధి దీపాల కరెంట్ ఛార్జీలు చెల్లించేందుకు నిధుల లేవని పేర్కొన్నారు.

అదేవిధంగా, జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో ప్రజలకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ, అక్కడ మందులు లేకపోవడం, వైద్యులు సక్రమంగా హాజరు కావడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. 150 డివిజన్లలో ఈ పరిస్థితి ఉన్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స‌మ‌స్య‌లపై ప్రజాస్వామిక వాదులు సూచిస్తున్నది, ప్రభుత్వ ఉచిత పథకాలను తగ్గించి, ఆదాయం సమకూర్చే మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.

Ravula Sridhar Reddy : కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేత సంచలన వ్యాఖ్యలు