Site icon HashtagU Telugu

Actor Rahul Ramakrishna: గాంధీని అవ‌మానించిన టాలీవుడ్ న‌టుడు రాహుల్ రామకృష్ణ!

Actor Rahul Ramakrishna

Actor Rahul Ramakrishna

Actor Rahul Ramakrishna: జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు (అక్టోబర్ 2) వంటి పవిత్రమైన రోజున తెలంగాణలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ‘పెయిడ్ ఇన్‌ఫ్లుయెన్సర్’ రాహుల్ రామకృష్ణ Actor (Rahul Ramakrishna) గాంధీజీని అవమానించే విధంగా ప్రవర్తించారని పలు వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాజకీయ వర్గాలు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

నిర్లక్ష్యం, నిందల రాజకీయం

రాహుల్ రామకృష్ణ వ్యవహారంపై కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ప్రతిపక్షాలు ప్రశ్నాస్త్రాలు సంధించాయి. “కేటీఆర్ గారూ మిమ్మల్ని మీరు ‘నేషనల్’ నాయకుడిగా చెప్పుకుంటారు. మరి జాతి పితను అవమానించే ధైర్యం మీకు ఎలా వచ్చింది?” అని ప్రశ్నించారు. గాంధీ జయంతి రోజున “గాంధీజీ గొప్పవాడని నేను అనుకోవట్లేదు” అని రాహుల్ రామ‌కృష్ణ వివాదాస్పద పోస్ట్ చేశారు.

రాహుల్ రామకృష్ణ టాలీవుడ్‌లో చిన్న పాత్రలు పోషిస్తూ సినిమా అవకాశాలు దక్కక రాజకీయ అవకాశవాదంగా మారి, కేటీఆర్‌ పర్యవేక్షణలో ‘పెయిడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌’గా పనిచేస్తున్న రాహుల్ రామకృష్ణను ఈ పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు నిలదీశాయి. సాధారణంగా ఇలాంటి వ్యక్తులను కాంగ్రెస్‌పై విమర్శలకు ఆయుధంగా ఉపయోగిస్తారని, కానీ ఇప్పుడు జాతి పితపై దాడికి ప్రోత్సహించడం ముమ్మాటికీ అమానుషమని ఖండించాయి.

Also Read: Indian Army Chief Upendra Dwivedi Warns Pakistan : భారత్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గాంధీ జయంతికి కనీస శ్రద్ధాంజలి లేదనే ఆరోపణలు

అదే అక్టోబర్ 2న కేటీఆర్ సహా బీఆర్‌ఎస్‌ నాయకులు జాతి పితకు కనీస శ్రద్ధాంజలి కూడా సమర్పించలేదన్న ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేటీఆర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ‘డ్రై డే’ రోజున కూడా ఫామ్‌హౌస్‌లో మద్యసేవనంతో గడిపారు అని సూచనలు వినిపిస్తున్నాయని, దేశతండ్రి పట్ల గౌరవం లేకపోతే, తెలంగాణ కోసం పోరాడిన వీరులకు ఎంత గౌరవం ఇస్తారని ప్రశ్నించారు. “మీ పార్టీలో గాంధీవాదం ఎక్కడ ఉంది? మీరు తెలంగాణ పోరాటకారులను, వారి త్యాగాలను మరచిపోమంటారా?” అంటూ బీఆర్‌ఎస్ విధానాలపై మండిపడ్డారు.

రాహుల్ రామకృష్ణపై తక్షణ చర్యకు డిమాండ్‌

కేటీఆర్ గారికి గాంధీజీ పట్ల కనీస గౌరవం ఉంటే తమ ‘పెయిడ్ ఇన్‌ఫ్లుయెన్సర్’ రాహుల్ రామకృష్ణ చేసిన తప్పును వెంటనే ఖండించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. “మీరు తక్షణమే రక్షణా చర్య తీసుకోకపోతే, ఈ మచ్చ మీ పార్టీపై, మీ నాయకత్వంపై ఎప్పటికీ తొలగదు” అని హెచ్చరించారు. రాహుల్ రామకృష్ణపై గాంధీజీని అవమానించిన ఆరోపణల మేరకు పోలీసులు తగిన చర్యలు తీసుకొని, కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.

Exit mobile version