ఇక నుంచి వాట్సాప్‌లో తెలంగాణ సర్కార్ సేవలు అందుబాటులో ఉంటాయి.

Telangana All Government Services On Whatsapp  ప్రజలకు అందించే సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మీ సేవ సర్వీసులు, టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లతో పాటు పలు సర్వీసులను వాట్సాప్ ద్వారా అందిస్తుండగా.. మరిన్ని సేవలను కూడా డిజిటల్గా అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖలన్నింటినీ వాట్సాప్తో లింక్ చేయనున్నారు. త్వరలోనే పలు పథకాలను కూడా వాట్సాప్లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సేవల వైపు […]

Published By: HashtagU Telugu Desk
Telangana All Government Services On Whatsapp

Telangana All Government Services On Whatsapp

Telangana All Government Services On Whatsapp  ప్రజలకు అందించే సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మీ సేవ సర్వీసులు, టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లతో పాటు పలు సర్వీసులను వాట్సాప్ ద్వారా అందిస్తుండగా.. మరిన్ని సేవలను కూడా డిజిటల్గా అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖలన్నింటినీ వాట్సాప్తో లింక్ చేయనున్నారు. త్వరలోనే పలు పథకాలను కూడా వాట్సాప్లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సేవల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఒక్క క్లిక్‌తో ప్రభుత్వ సేవలను మన అరచేతిలోకే తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మీ-సేవ, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా సెల్‌ఫోన్‌లోనే చూసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ పాలనను ప్రజల చేతిలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మీ-సేవ ద్వారా అందే సేవలు, ఇంటర్, పదో పరీక్షల హాల్ టికెట్లను వాట్సాప్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ప్రభుత్వ సేవలను కూడా డిజిటల్‌గా అందుబాటులోకి తెస్తోంది.

ఒక్కొక్కటిగా వివిధ శాఖల సేవలను కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌తో లింక్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీ సేవకు సంబంధించిన లింక్ ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో అరచేతిలోకి రానుంది. అదే సమయంలో భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ బోర్డులు కూడా ఈ వాట్సాప్‌నే వినియోగించేలా ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్ అయి వాట్సాప్‌లో అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ సెంటర్లు, మీ-సేవ సెంటర్ల చుట్టూ తిరిగే పని లేకుండా కేవలం వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలు అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ వాట్సాప్ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 80969 58096 అనే నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో వేర్వేరు డిపార్ట్‌మెంట్‌లకు వేర్వేరుగా ఉన్న పోర్టల్‌లతో తీవ్ర గందరగోళం ఏర్పడగా, దానికి స్వస్తి పలుకుతూ ఈ ఇంటిగ్రేటెడ్ విధానాన్ని తీసుకువచ్చి అన్ని సేవలకు ఒకే వాట్సాప్ నంబర్‌ను తీసుకువచ్చారు. ప్రజల ఫిర్యాదుల దగ్గరి నుంచి సర్టిఫికెట్ల జారీ వరకు అన్నింటినీ ఒకే దగ్గరికి చేర్చే విప్లవాత్మక మార్పులు చేస్తున్నారు. ఇది కేవలం సమాచారం కోసమే కాకుండా నేరుగా సేవలు పొందే వేదికగా మార్చారు.

ఇటీవల పలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన హాల్ టికెట్లను కూడా వాట్సాప్‌లో అందుబాటులో ఉంచారు. కేవలం రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, పేరు వంటి వివరాలు ఎంటర్ చేయగానే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో స్టేట్ లెవల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా వాట్సాప్‌లోనే అందించనున్నారు. ఫలితాలు కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ప్రభుత్వ మెసేజ్‌లు, అలర్ట్‌లు కూడా ఇదే వాట్సాప్ నంబర్ ద్వారా ప్రజలకు చేరనున్నాయి.

ప్రస్తుతం మీ-సేవ పోర్టల్‌లో లభించే దాదాపు అన్ని సేవలు వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయి. కులం, ఆదాయం వంటి సర్టిఫికెట్లు, వాటి స్టేటస్ తెలుసుకోవడం దగ్గర నుంచి మున్సిపల్ ట్యాక్స్‌ల చెల్లింపు వరకు వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయి. రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాల వంటి కీలక శాఖల సమాచారం కూడా అరచేతిలోకి తెచ్చారు. హాయ్ అని ఒక్క మెసేజ్ చేస్తే చాలు, ఆప్షన్లతో కూడిన మెనూ ప్రత్యక్షమవుతుంది.

రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నింటినీ ఈ వాట్సాప్ చాట్‌బాట్‌కు లింక్ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవడం, అర్హతలు చెక్ చేసుకోవడం, రేషన్ కార్డులు, పెన్షన్ల జారీ మరింత సులభం కానుంది. లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం వేసే డబ్బుల సమాచారం కూడా వాట్సాప్ మెసేజ్‌లో అందించనున్నారు. ఒకే నంబర్‌తో రాష్ట్ర ప్రజలందరికీ అన్ని ప్రభుత్వ సేవలు అందేలా వన్ స్టాప్ షాప్ విధానాన్ని తీసుకురానున్నారు.

 

 

 

  Last Updated: 03 Apr 2026, 12:25 PM IST