రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడ(Puppalaguda)లో జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే లంగర్ హౌస్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే, మొదటి అంతస్తులో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని అపస్మారక స్థితిలో బయటకు తీసుకురాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారు మరణించారని సమాచారం. మృతులను సిజిరా (7), సహానా (40), జమీలా (70)గా గుర్తించారు.
TNPCB : ఫౌండేషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు : సుప్రీంకోర్టు
ఈ ప్రమాదంలో మంటలు వేగంగా వ్యాపించడానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. భవనంలో మూడు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని తెలుస్తోంది. అగ్నిమాపక శాఖ తెలిపినదని ప్రకారం.. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఫైరింగ్ స్టేషన్‌కు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయితే పైన చిక్కుకున్న ఐదుగురిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తంగా వ్యవహరించిన అగ్నిమాపక సిబ్బంది మరో ఐదుగురిని సురక్షితంగా కాపాడగలిగారు.
SLBC Tunnel : టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి ?
అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణాలు గ్యాస్ లీకేజీలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు కావొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భవనాల్లో అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమాదం స్థానిక ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి తగిన సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రమాదాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, భద్రతా నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది.