Smita Sabharwal: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై “హాయ్ హైదరాబాద్” అనే ‘ఎక్స్’ హ్యాండిల్ మార్చి 31న ఒక గిబ్లీ ఫొటోను పోస్ట్ చేసింది. అయితే తొందరపాటుతో ఈ గిబ్లీ ఫొటోను స్మితా సభర్వాల్(Smita Sabharwal) రీపోస్ట్ చేశారు. ఈ ఫొటోలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లు చిత్రీకరణ ఉంది. వాటి ఎదుట ఒక నెమలి, జింకలు నిలబడి ఉన్నాయి. ఈ పోస్టును స్మితా సభర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. దీన్ని నిశితంగా పరిశీలించిన పోలీసు విభాగం.. అది ఫేక్ ఫొటో అని తేల్చారు. దీంతో భారత న్యాయ సంహితలోని సెక్షన్179 కింద ఆమెకు నోటీసులు అందించారు.
#Ghibli Story On #Hyderabad Today! #SaveHCU #SaveHCUBioDiversity#SaveHyderabadBioDiversity 🏞️ pic.twitter.com/ozbmxvSZ7D
— Hi Hyderabad (@HiHyderabad) March 31, 2025
Also Read :Robert Vadra : పాలిటిక్స్‌లోకి రాబర్ట్ వాద్రా.. గ్రౌండ్ రెడీ ?
ఏఐ ఫొటోలు, వీడియోలు.. సీఎం రేవంత్ సీరియస్
హెచ్‌సీయూ, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం, చెట్ల నరికివేతకు సంబంధించి కొందరు ఏఐతో ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజానిజాలను తెలుసుకోకుండా ఎంతోమంది ప్రముఖులు ఏఐ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టారని గతంలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.
Also Read :Justice BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్.. నేపథ్యమిదీ
ఇప్పటికే పలువురికి నోటీసులు
ఈ అంశంలో ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు, కొంతమంది బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐఏఎస్ స్మితా సభర్వాల్ ఫేక్ ఫొటోలను రీపోస్ట్ చేశారంటూ తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొత్తం మీద ఏఐ టెక్నాలజీ సామాన్యుల నుంచి ఐఏఎస్‌ల వరకు అందరినీ పక్కదోవ పట్టిస్తోంది. అబద్ధాన్ని కూడా నిజం అని నమ్మేలా చేస్తోంది.