సిరిసిల్లలో ఓటర్లకు నకిలీ బంగారు కాయిన్స్ పంపిణీ

Fake Gold Coins  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో నిన్న పోలింగ్ ముగిసింది. చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఎన్నికల సమయంలో చాలామంది అభ్యర్థులు అనధికారికంగా ఓటర్లకు నగదు, ఇతర బహుమతులు పంచుతుంటారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఒక అభ్యర్థి ఇచ్చిన కానుక చర్చనీయాంశంగా మారింది. తమకు గోల్డ్ కాయిన్ అని చెప్పి […]

Published By: HashtagU Telugu Desk
Fake Gold Coins

Fake Gold Coins

Fake Gold Coins  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో నిన్న పోలింగ్ ముగిసింది. చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

ఇక ఎన్నికల సమయంలో చాలామంది అభ్యర్థులు అనధికారికంగా ఓటర్లకు నగదు, ఇతర బహుమతులు పంచుతుంటారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఒక అభ్యర్థి ఇచ్చిన కానుక చర్చనీయాంశంగా మారింది. తమకు గోల్డ్ కాయిన్ అని చెప్పి నకిలీ కానుక ఇచ్చారంటూ సిరిసిల్లలో ఓ వార్డులో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు అభ్యర్థి ఓట్లు వేయించుకోవడానికి రాగి నాణేలకు పసిడి పూత పూసి వాటిని బంగారు నాణేలుగా ఇచ్చారని పలువురు వాపోయారు. ఓటర్ల ఆగ్రహం నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై అధికారులు విచారణ చేపట్టారు.

  Last Updated: 12 Feb 2026, 11:50 AM IST