Meerpet Murder Case : హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో జరిగిన మాధవి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసింది. మాజీ సైనికుడైన మాధవి భర్త గురుమూర్తే అత్యంత అమానుష రీతిలో ఈ హత్యకు పాల్పడ్డాడు. పోలీసుల దర్యాప్తులో ఈ హత్యకు సంబంధించిన మరిన్ని కొత్త వివరాలు వెలుగుచూశాయి. అవేంటో చూద్దాం..
Also Read :DBT Schemes Tsunami : మహిళలకు ‘నగదు బదిలీ’తో రాష్ట్రాలకు ఆర్థిక గండం : ఎస్‌బీఐ నివేదిక
హీటర్ సాయంతో ఉడికించి..
భార్య మాధవిని హత్య చేసిన తర్వాత గురుమూర్తి.. ఆమె శరీర భాగాలను బాత్‌రూంలో ముక్కలు ముక్కలుగా నరికాడు. మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు కత్తి, చెక్క, మొద్దును వాడాడు. మృతదేహం భాగాలను హీటర్ సాయంతో విడతల వారీగా గురుమూర్తి(Meerpet Murder Case) ఉడికించాడని పోలీసులు గుర్తించారు. శరీర భాగాలను ఉడికించడానికి అతడు పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని వినియోగించాడని విచారణలో వెల్లడైంది.
Also Read :Phone Tapping Case : మరో సంచలనం.. గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్ సైతం ట్యాప్
ఎముకలను పొడిచేసి..
మాధవి ఎముకలను పొడి చేసి బాత్‌రూమ్ ఫ్లష్ ద్వారా డ్రైనేజీలోకి పంపాడని తేలింది. బ్లూ రేస్ టెక్నాలజీ ద్వారా గురుమూర్తి నివాసంలో దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ రాత్రికల్లా పోలీసుల చేతికి మాధవి డీఎన్‌ఏ రిపోర్టు అందనుంది.
హత్యకు కారణం అదేనా ?
సంక్రాంతి పండుగ కోసం భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోనే ఉండే తన సోదరి ఇంటికి గురుమూర్తి వెళ్లాడు. పిల్లలకు సెలవులు కావడంతో వారిని సోదరి ఇంటి వద్దే వదిలేశాడు. జనవరి 14న సాయంత్రం గురుమూర్తి, మాధవి తమ ఇంటికి తిరిగొచ్చారు. ఆ తర్వాత ప్రతిరోజూ రాత్రి మాధవితో గురుమూర్తి గొడవపడేవాడు. ఆమెను కొట్టి తోసేయడంతో కిందపడి మాధవి చనిపోయింది. ఆమె తలకు బలమైన గాయం కావడం వల్లే చనిపోయినట్లు తెలిసింది. దీంతో కంగారుపడిన గురుమూర్తి, మృతదేహాన్ని మాయం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో రాత్రంతా వీడియోలను చూసి జనవరి 16న ఉదయం భార్య మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో గురుమూర్తి ఉంటున్న ఇంటి యజమాని ఫ్యామిలీతో సహా బెంగళూరులో ఉన్నారు. తన వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని పెళ్లి చేసుకోవడం కోసమే గురుమూర్తి ఇలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.