Haryana Election Results : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్యానా ఎన్నికల ఫలితాలపై ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడిందని హరీశ్‌రావు తెలిపారు.
Read Also: Pawan Kalyan : 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’: డిప్యూటీ సీఎం పవన్
ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కశ్మీర్‌లో బీజేపీని విశ్వసించలేదు.. హర్యానాలో కాంగ్రెస్‌ను విశ్వసించలేదు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉన్నదనేది సుస్పష్టం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మరోవైపు హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గ్యారెంటీల పేరుతో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఆ విషయాన్ని హర్యానా ప్రజలు గ్రహించారు అని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని అంశాలు స్పష్టంగా తెలిశాయి. 2029లో బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌కు దూరంగా ఉంటాయి. తదుపరి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం. దశాబ్దం అంతకంటే ఎక్కువ కాలమే ఈ పరిస్థితి కొనసాగొచ్చు. గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. కర్ణాటక( 5 గ్యారెంటీలు), హిమాచల్ ప్రదేశ్( 10 గ్యారెంటీలు), తెలంగాణ( 6 గ్యారెంటీలు) ప్రజలను గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ గ్యారెంటీలు అబద్దమని హర్యానా ప్రజలు గ్రహించారని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.