Site icon HashtagU Telugu

ED Raids : సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్‌లో ఈడీ రైడ్స్.. కారణాలివీ

ED Raids on Surana Group Sai Surya Developers Hyderabad

ED Raids : హైదరాబాద్​లోని సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ కంపెనీల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. సురానా గ్రూప్స్ అధినేత నరేంద్ర సురానా(ED Raids) నివాసంలో రైడ్స్ జరుగుతున్నాయి. డైమండ్ పాయింట్‌లోని అరిహంత్ ఎంక్లేవ్​లో ఉన్న  ఆయన ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ వ్యాపార గ్రూప్ ఎండీ, డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచే రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లోని ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి.   సురానా గ్రూపునకు అనుబంధంగా సాయిసూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. సకాలంలో వెంచర్లను అందించడంలో విఫలమైనందుకు సాయి సూర్య డెవలపర్స్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ చంద్ర గుప్తాపై గ్రీన్ మెడోస్ వెంచర్ మోసం కేసు నమోదైంది. 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇటీవల సతీష్ చంద్రపై చీటింగ్ కేసు పెట్టాడు. ఈసంస్థకు స్టార్ హీరో మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

Also Read :Rajya Sabha ByPoll: రాజ్యసభ బైపోల్ షెడ్యూల్ రిలీజ్.. రేసులో ఆ ముగ్గురు ?

3 బ్యాంకులకు రూ.3,986 కోట్ల కుచ్చుటోపీ 

సురానా గ్రూప్ ప్రస్తుతం సోలార్ పవర్ వ్యాపారంలో ఉంది. ఈ కంపెనీ మనీలాండరింగ్​కు పాల్పడి ఉండొచ్చనే అనుమానంతో ఈ రైడ్స్ చేస్తున్నారు. చెన్నైలోని 3 బ్యాంకులకు రూ.3,986 కోట్ల రుణాలను సురానా గ్రూప్ ఎగ్గొట్టింది.  దీంతో ఆ వ్యాపార గ్రూపుపై 3 కేసులను  సీబీఐ నమోదు చేసింది. .ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ వ్యవహారం కూడా జరిగి ఉండొచ్చనే సందేహంతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 2021 ఫిబ్రవరిలో సురానా గ్రూప్‌పై ఈడీ రైడ్స్ చేసి రూ.11.62 కోట్లు విలువైన బంగారం, నగదును సీజ్ చేసింది. సురానా గ్రూప్, అనుబంధ సంస్థలపై PMLA కేసు నమోదు చేసింది. కంపెనీ ఎండీ దినేష్‌చంద్ సురానా, విజయ్‌రాజ్ సురానా, ఇద్దరు డమ్మీ డైరెక్టర్లను 2022లో ఈడీ అరెస్ట్ చేసింది.

Also Read :Mark Shankar : మార్క్ శంకర్‌ను కాపాడిన భారత కార్మికులకు అవార్డు