Double Decker buses: డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్..!

చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు సందడి చేస్తున్నాయి. పర్యాటకులను, సిటీజనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అయితే

  • Written By:
  • Updated On - February 8, 2023 / 08:42 AM IST

Double Decker Buses: చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు సందడి చేస్తున్నాయి. పర్యాటకులను, సిటీజనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఒకప్పుడు హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియంతో పాటు డబుల్ డెక్కర్ బస్సులు గుర్తుకొచ్చేవి. నిజాంకాలంలో ప్రారంభమైన ఈ డబుల్ డెక్కర్ బస్సులు 2003 వరకు నడిచాయి. ఇప్పుడు హైదరాబాద్ లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 20 బస్సులను నగర రోడ్లమీద నడపాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ రోజు 3 బస్సులను ప్రారంభించింది. ఇవి ఎలక్ట్రిక్ బస్సులు. ఈ బస్సులు డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఇవి ఒకే ఛార్జ్‌ లో 150 కి.మీలు ప్రయాణిస్తాయి. 2 గంటల నుండి 2.5 గంటలలోపు పూర్తిగా ఛార్జ్ అవుతాయి.

మంగళవారం హైదరాబాద్ లో చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎ శాంతికుమారి మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న‌ ఫార్ములా ఇ-ప్రిక్స్ నేపథ్యంలో, ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ లను కవర్ చేస్తూ రేస్ ట్రాక్ చుట్టూ తిరుగుతాయి. ఫిబ్రవరి 11 తర్వాత, నగరాల పర్యాటకాన్ని పెంపొందించడానికి బస్సులను హెరిటేజ్ సర్క్యూట్‌లో ఉపయోగించాలని యోచిస్తున్నారు.