Site icon HashtagU Telugu

Harish Rao : హరీష్ రావు మాట యూత్ వింటారా..?

Harishraocng

Harishraocng

కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) పై హరీష్ రావు (Harish Rao) దూకుడు పెంచారు. సై అంటే సై అంటున్నారు. ఇప్పటికే హైడ్రా (Hydraa) , రుణమాఫీ (Runamafi) పై పెద్ద ఎత్తున వార్ కొనసాగించిన హరీష్..ఇప్పుడు కాంగ్రెస్ హామీలపై చర్చ మొదలుపెట్టాలని యూత్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ లో దసరా (Dasara) పండగను ఎంత ఘనంగా జరుపుకుంటారో తెలియంది కాదు..దేశంలోనే కాదు వరల్డ్ లో ఎక్కడ ఉన్న సరే తెలంగాణ ప్రజలు తమ సొంతర్లకు వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో దసరాకు ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ – బలాయ్ తీసుకుని కాంగ్రెస్ చేసిన మోసాలపై చర్చించాలని యువతకు హరీష్ రావు పిలుపు నిచ్చారు.

గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధు ఊసే లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కొత్త ప్రాజెక్ట్ లు లేవు, ఇలా ఏమి అమలు జరగడం లేదని ..కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తించాలని సూచించారు. అందుకే ఈ పండుగ సమయంలో ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ ‌- బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించాలని పిలుపునిచ్చారు. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌లపై ఎక్కడిక్కడ నేతలను నిలదీయాలని ‘కాంగ్రెస్ ఫెయిల్ తెలంగాణ’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరి హరీష్ రావు పిలుపు మేరకు యూత్ కాంగ్రెస్ పై సోషల్ వార్ చేస్తారా..? లేదా అనేది చూడాలి.

Read Also : Amit Shah : మావోయిస్టు ప్రభావిత 8 రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష

Exit mobile version