Site icon HashtagU Telugu

Ration Card : రేషన్‌కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దు : సీఎం రేవంత్

Ration Cards update 2025

Ration Card : ఆరోగ్యశ్రీ కార్డుల అంశంపై సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు(Ration Card) లింకు పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండింటికి లింకు పెడితే సామాన్య ప్రజలు ఇబ్బందిపడతారని, అలా చేయొద్దన్నారు.  తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. దీనిపై అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. దీనివల్ల ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయి’’ అని అధికారులకు సీఎం రేవంత్(CM Revanth) నిర్దేశించారు. రూరల్ ఏరియాలలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read :AP Cabinet : ముగిసిన ఏపీ క్యాబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు ఇవే!

ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించేలా పనిచేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్‌లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలని కోరారు. మంగళవారం(జులై 16) సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు’’ అని సీఎం పేర్కొన్నారు. కలెక్టర్లు బదిలీ అయితే.. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేలా పనితనం ఉండాలన్నారు.  ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.

Also Read :BRS : బిఆర్ఎస్ నేతలంతా పార్టీని వీడడానికి అసలు కారణం అతడేనా..?