Conocarpus Trees: బీఆర్ఎస్ హయాంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో కోట్లాది మొక్కలను నాటారు. వీటిలో పెద్ద సంఖ్యలో కోనోకార్పస్ మొక్కలు కూడా ఉన్నాయి. వీటిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవలే అసెంబ్లీ వేదికగా కోరారు. ఈ చెట్లను పెంచొద్దని 2022లోనే తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ పరిధిలో కోనోకార్పస్ మొక్కల పెంపకంపై 2022 మే నెలలో జీహెచ్‌ఎంసీ బ్యాన్ విధించింది. అయినా వీటి తొలగింపుపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. ఇంతకీ ఎందుకు ? కోనోకార్పస్ మొక్కలు, చెట్లతో వచ్చే సమస్య ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read :Imran Khan : నోబెల్‌శాంతి పురస్కారానికి ఇమ్రాన్ పేరు.. తెర వెనుక జెమీమా!
కోనోకార్పస్ చెట్ల గురించి..
- కోనోకార్పస్ చెట్లు శంఖు ఆకారంలో పచ్చగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
- హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరం పరిధిలోని డివైడర్లు, పార్కులలో ఈ మొక్కలను నాటారు.
- కోనోకార్పస్ అనేవి అమెరికా ఖండంలోని తీర ప్రాంతాలకు చెందిన మాంగ్రూవ్ జాతి మొక్కలు.
- కోనోకార్పస్(Conocarpus Trees) జాతి మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఎక్కడపడితే అక్కడ పెరుగుతాయి. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు.
- భారత్, పాకిస్తాన్, అరబ్ దేశాలు, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఈ చెట్లను పెద్దసంఖ్యలో పెంచారు. ఎడారి ప్రాంతాల్లో దుమ్ము, ఇసుక తుఫానులు ఎక్కువ. వాటిని అడ్డుకునేందుకు ఈ చెట్లను పెంచారు. కాలక్రమంలో వీటి దుష్ప్రభావాల గురించి తెలియడంతో, తొలగించే దిశగా అడుగులు వేశారు. దుబాయ్‌లో అయితే ఈ చెట్లను వేళ్లతో సహా పెకిలించారు.
Also Read :MLC Election: హైదరాబాద్ ‘లోకల్’ ఎమ్మెల్సీ.. గెలుపు ఆ పార్టీదే
- ఈ చెట్లు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి.
- కోనోకార్పస్ చెట్ల వేర్లు బలంగా ఉండి, భూగర్భంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. దీనివల్ల నీటి పైప్‌లైన్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర నిర్మాణాలు దెబ్బతింటాయి.
- ఈ చెట్లు భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తాయని అరబ్ దేశాల్లో నిర్వహించిన అధ్యయనాల్లో గుర్తించారు.
- ఈ చెట్ల వల్ల భవనాలు, నిర్మాణాలకు నష్టం జరుగుతుందని ఇరాక్‌లోని మిసాన్ ప్రావిన్స్‌లో జరిగిన అధ్యయనంలో గుర్తించారు.
- కోనోకార్పస్ చెట్టు పువ్వు నుంచి వెలువడే రేణువులు యమ డేంజర్. వీటి వల్ల మనుషులకు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది.
- ఈ మొక్కలకు బదులుగా చింత, వేప, మర్రి వంటి మొక్కలను నాటాలని నిపుణులు సూచిస్తున్నారు.