Kavithas New Party: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఎవరు అంటే.. కచ్చితంగా కల్వకుంట్ల కవితే అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఆమె పెద్ద సెన్సేషన్‌గా మారారు. ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్‌కు లేఖ రాయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కవిత హాట్ టాపిక్‌గా మారారు. బీఆర్ఎస్ పార్టీపై పట్టు కోసం కేటీఆర్, కవిత మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందనే టాక్‌ను బలపరిచేలా ఈ పరిణామాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఒకవేళ రాబోయే రోజుల్లోనూ బీఆర్ఎస్‌లో తనకు తగిన గుర్తింపు లభించకుంటే, సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాలని కవిత అనుకుంటున్నారట. దీంతో ఆమె రాజకీయ పార్టీకి ఎలాంటి పేరును పెడతారు ? అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. సొంత పార్టీ ఏర్పాటు గురించి ఇప్పటివరకు కవిత ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ ఆమె పార్టీ పెడితే.. దానికి ఏ పేరు ఉంటుందనే చర్చ ఇప్పుడే మొదలైందంటే, ఈ టాపిక్‌పై ప్రజలకు ఎంతటి ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read :Kavithas Letter Issue : కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కవిత లేఖ వ్యవహారంపైనే ప్రధాన చర్చ
పార్టీ పేరుపై తీరొక్క ఊహాగానాలు
కవిత(Kavithas New Party) పెట్టబోయే రాజకీయ పార్టీ పేర్లపైనా ఇప్పటికే కసరత్తు జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అయినా దీన్ని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ లెక్కన ఇవన్నీ ఊహాగానాలే అని చెప్పొచ్చు. వీటి ప్రకారం.. తన పార్టీ కోసం రెండు పేర్లను కవిత రెడీ చేసుకున్నారని అంటున్నారు. తెలంగాణ జాగృతి పార్టీ అనే పేరుకే ఆమె ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పాత పేరు టీఆర్ఎస్‌కు దగ్గరగా ఉండేలా మరో పేరును కూడా రెడీ చేసుకున్నారట. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరులో బహుజన అనే పదాన్ని జోడించి దాని కోసం అప్లై చేసుకునే అవకాశం ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు.