Site icon HashtagU Telugu

Bhatti Vikramarka : పదేళ్లు బిఆర్ఎస్ చేయలేని రుణమాఫీని కాంగ్రెస్ చేసింది – భట్టి

Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka Mallu

ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ఆ రాజకీయం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతూ అభివృద్ధి జరగకుండా అడ్డుపడాలనే ఆలోచన చేస్తే అది రాజకీయ విజ్ఞత అనిపించుకోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka On Fires On BRS) అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం నరసింహపురం, బుచ్చిరెడ్డిపాలెం, బనగండ్లపాడు, తక్కెళ్ళపాడు, సకినవీడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎర్రుపాలెం మండలానికి చెందిన బిఆర్ ఎస్ నాయకులు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ కండువా కప్పు పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చేయకుండా కాళ్లల్లో అడ్డుగా కట్టే పెట్టడం మంచి రాజకీయ నాయకుడి లక్షణం కాదు అని ప్రతిపక్షాలకు సూచించారు.

Naresh : మా అమ్మ బయోపిక్ తీస్తాను.. మా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి.. నరేష్ కామెంట్స్..

ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు వేసుకుంటూ ప్రజల అవసరాల కోసం పనిచేస్తూ ముందుకు పోతున్నదని వివరించారు. పాదయాత్రలో విన్న ప్రజల గుండె చప్పుడుని అంకెలుగా మార్చి  ప్రజల సమస్యలను ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజా బడ్జెట్ ను ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి బాటిల్ వేస్తున్నదని  తెలిపారు.  ప్రజలు ఇచ్చిన పదవులను బాధ్యతగా, సేవగా భావించి రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకు 18 గంటల పాటు ప్రజా ప్రభుత్వంలోని పాలకులు కష్టపడుతున్నారని వెల్లడించారు. ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకోవడానికి వెన్నులో భయం పెట్టుకొని బాధ్యతతో ప్రజల అవసరాల కోసం పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నామని చెప్పారు.

Big Shock To BRS: ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు మ‌రో భారీ షాక్‌!

పదేళ్లు ధనిక రాష్ట్రాన్ని పరిపాలించిన గత బిఆర్ఎస్ పాలకులు 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీని అమలు చేయలేకపోయారని విమర్శించారు. నాలుగు విడతల్లో అమలు చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని అసలు అలాగే మిగిలిపోయిందని వివరించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేని రుణమాఫీని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేవలం ఏడాదిలోనే రాష్ట్రంలోని రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీకి 22 వేల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా బిఆర్ఎస్‌ ఎగ్గొట్టిన డ‌బ్బుల‌ను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఒకే రోజు రూ.7,624 కోట్లు జమ చేసిందన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ రైతు భరోసా ఈనెల 26 నుంచి ఇస్తున్నామని ఇస్తున్నామ‌ని, రూ.8400 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో  జమ చేయబోతున్నట్టు ప్ర‌క‌టించారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ. 12వేల రూపాయ‌లు ఇస్తామ‌ని, ఈనెల 26 తర్వాత మొదటి విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు  ల‌బ్ధిదారుల‌ బ్యాంకు ఖాతాల్లో వేస్తామ‌ని వెల్ల‌డించారు. రైతులు పండించిన సన్న ధాన్యానికి క్వింటాకు 500 రూపాయలు చొప్పున రైతుల‌కు బోనస్ చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి డైట్ చార్జీలు పెంచకుండా గాలికి వదిలేస్తే..,  విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా ఆలోచించి 40 శాతం డైట్ చార్జీలు పెంచడంతో పాటు 200% కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన చ‌రిత్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ద‌క్కుతుంద‌న్నారు.

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో విద్య‌ను అందించ‌డానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల ఏర్పాటుకు బ‌డ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించి పాఠశాలల నిర్మాణాలకు పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు.రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలను అడియాసలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా గ‌త పాల‌కులు గాలికి వదిలేశార‌ని విమ‌ర్శించారు.  ప్ర‌జా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఏడాది లోపు 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామ‌న్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన  ఆరు గ్యారంటీలో భాగంగా అధికారంలోకి రాగానే రాష్ట్ర మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పించామ‌న్నారు. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రజాప్రతి అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని ఏడాదికి 20 వేల కోట్లు, ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా మహిళలకు రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ప్రవేశపెట్టిన వ్య‌వ‌సాయ ఉచిత విధ్యుత్తు పథకాన్ని ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నదని,  రాష్ట్రంలోని 28 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్న‌ట్టు చెప్పారు. వ్యవసాయ పంపుసెట్ల ద్వారా రైతులకు అందిస్తున్న ఉచిత కరెంటుకు సంబంధించి ఏడాదికి 11 వేల కోట్ల రూపాయలను  రైతుల పక్షాన డిస్కములకు ప్ర‌భుత్వం చెల్లిస్తున్నదన్నారు. గత మార్చి ఒకటి నుంచి అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ. 148.5 కోట్లు చెల్లిస్తున్న‌ద‌ని, ఇప్పటి వరకు విద్యుత్ శాఖకు రూ. 1485 కోట్ల రూపాయలను చెల్లించిందని చెప్పారు. గ‌త పాల‌కుల మాధిరిగా విలాసాలకు, అనవసర ఖర్చులకు ప్రజాధనాన్ని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టమ‌న్నారు.

సంపద సృష్టించి సృష్టించిన సంపదను ప్రతి ఒక్కరికి పంచడమే ల‌క్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప‌ని చేస్తుంద‌న్నారు. గత పాలకుల మాదిరిగా నాలుగు గోడల మధ్యలో కూర్చొని మా అభిప్రాయాలను బలవంతంగా ప్రజలపైన రుద్దమని తెలిపారు. ప్రజల మధ్యనే నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజలు కడుతున్న పనుల ద్వారా వస్తున్న ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన ఖర్చులను ప్రతి గ్రామంలో ప్రజలకు తెలిసే విధంగా చాటి చెప్తామని చెప్పారు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామసభల్లోనే జరుగుతుందని ఇందులో ఎలాంటి అపోహలు అనుమానాలు ప్రజలు పెట్టుకోవద్దని సూచించారు.