Site icon HashtagU Telugu

Revanth Reddy : రేవంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి – సీపీఐ నారాయణ

Cpi Narayana

Cpi Narayana

సీఎం రేవంత్ రెడ్డి ని వెంటనే అరెస్ట్ చేయాలనీ ఆలా చేస్తే మంచిదని తెలిపారు సీపీఐ నారాయణ. బిజెపికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన..ప్రవర్తించిన వెంటనే వారిపై ఈడీ, ఐటీ అధికారులను పంపి అరెస్ట్ చేయించడం అలవాటుగా మారిందని..ఇప్పటికే జార్ఖండ్ సీఎం, ఢిల్లీ సీఎం లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని , ఇప్పుడు తెలంగాణ సీఎం ను సైతం అరెస్ట్ చేస్తే ముచ్చటగా ముగ్గురవుతారని చెప్పుకొచ్చారు నారాయణ.

We’re now on WhatsApp. Click to Join.

ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో మాట్లాడుతూ.. దేశ ద్రోహం కింద మొదట అరెస్ట్ చేయాల్సి వస్తె మోడీని, రెండవ వ్యక్తిగా అమిత్ షాలను అరెస్ట్ చేయాలని నారాయణ అన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న సీఎంలు దొంగలు అయినా వారు మంచివారే. కానీ వ్యతిరేకిస్తే మాత్రం వారిని జైలుకి పంపిస్తారు’’ అని నారాయణ మండిపడ్డారు. ఇదే సందర్బంగా కేసీఆర్ ఫై సెటైర్లు వేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.. నామా నాగేశ్వరరావును మంత్రిని చేస్తాడంట. ఈయనకే దిక్కు లేదు నామాను మంత్రిని చేస్తాడట అంటూ తనదైన శైలి లో కౌంటర్లు వేశారు.

Read Also : Pawan Kalyan : అప్పుడు ఎన్టీఆర్.. ఇటీవల విజయ్.. ఇప్పుడు పవన్.. ఈసారి ఫైట్ ఎలా ఉంటుందో..?