Cold Wave : తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువకు వచ్చాయి. ప్రజలు చలిని తట్టుకునేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే.. వాతావరణ కేంద్రం అధికారులు రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత వారం వరకు హైదరాబాద్ లో 17-30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండగా, ప్రస్తుతం 13 డిగ్రీలకు దిగువకు పడిపోయాయి. ఈ చలిని ఉత్తర గాలుల ప్రభావం పెంచినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాలు, ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
CM Revanth: తెలుగువారి హవా తగ్గింది.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తూర్పు గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో చలిని పెంచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గే అవకాశముందని అంచనా వేసింది. ఈ చలిలో ఆరుగురు ప్రధాన నగర జోన్లలో ఉదయం పొగమంచు ఉంటుందని పేర్కొంది. అయితే.. ఈ చలి తీవ్రత పెరగడంతో ఉదయాన్నే పనులను వెళ్లేవారు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
ప్రజలు క్షేమంగా ఉండేందుకు, ప్రజలకు సలహా ఇవ్వడంలో డాక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ చలిలో అలర్జీ, వైరల్ వ్యాధులు, జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అలాగే, ఫంగస్, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువులు, పుప్పొడి వంటివి ఆస్తమా సమస్యలను ప్రేరేపిస్తాయని, ఈ దిశలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు ఆరోగ్యానికి హానికరమైన ఈ పరిస్థితి నుండి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Attack On Pak Army : పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై సూసైడ్ ఎటాక్.. 47 మంది సైనికులు మృతి ?