Site icon HashtagU Telugu

CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణ‌లో నిర్వ‌హించండి

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణలో క్రీడా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర క్రీడల , యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్. మాండవీయకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. 2026లో జరిగే ఖేలో ఇండియా గేమ్స్‌ను తెలంగాణకు కేటాయించాలని, అదే విధంగా జాతీయ , అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు కూడా రాష్ట్రానికి ఆతిథ్య హక్కు ఇవ్వాలని కోరారు.

క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, క్రీడాకారుల శిక్షణ, నిపుణుల ఎంపిక తదితర అంశాల్లో ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రానికి రూ.100 కోట్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ మంత్రి మాండవీయను కోరారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తోందని, కేంద్రం నుంచి తగిన మద్దతు లభిస్తే రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో మైదానాలు, క్రీడా కేంద్రాలు అభివృద్ధి చేయగలదని వివరించారు.

DK Shivakumar : నేను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు

ఈ సందర్భంగా భువనగిరి, రాయగిరి, మహబూబ్‌నగర్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండలలో నిర్మించాల్సిన స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్‌లు, అథ్లెటిక్స్ ట్రాక్‌లు, హాకీ ఫీల్డ్స్, స్క్వాష్ కోర్ట్‌లు వంటి మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించారని, వాటికి కేంద్రం నిధులు కేటాయించాలని సూచించారు. ఇప్పటికే దేశం 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తోందని గుర్తుచేసిన సీఎం, అందులో కనీసం రెండు క్రీడా ఈవెంట్లు తెలంగాణలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

అంతేకాదు, జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు మునుపటిలా రైలు ప్రయాణ ఛార్జీలపై రాయితీ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు.

Shocking: ఒక మృతదేహాన్ని ఐసీయూ‌లో ఉంచి లక్షలు వసూలు..?

Exit mobile version