తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల అధిక ఫీజుల (High fees of private schools) భారం తల్లిదండ్రులను కుదేల్ చేస్తుంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ చిన్నారుల ప్లేస్కూల్స్ (Playschools) కూడా సంపన్నుల కోసమే అన్నట్లు మారిపోతున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి లక్ష్యంగా వెయ్యి ప్రభుత్వ ప్లేస్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వెల్లడించారు.
Operation Sindoor : ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాక్
ప్రైవేట్ విద్యాసంస్థలద్వారా విద్యను వ్యాపారంగా మలుస్తున్న ధోరణికి ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్లేస్కూల్ స్థాయిలో నుంచే మంచి పునాది పడితే, విద్యార్థులకు భవిష్యత్‌లో నాణ్యమైన విద్యాబోధన అందిస్తామని తెలిపారు.
ISRO : పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో
ఈ సందర్భంగా నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో ప్రైవేటు స్కూళ్ల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక చర్చ జరిగింది. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు ప్రభుత్వ పాఠశాలలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. తల్లిదండ్రుల భారం తక్కువ చేసి, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు.