CM Revanth Reddy : నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : 16, 17 తేదీలలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ బయలుదేరి, అక్కడ చంద్రాపూర్, రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్‌షోలు నిర్వహించి, రాత్రికి తిరిగి నాగ్‌పూర్ చేరుకుంటారు.

Published By: HashtagU Telugu Desk
CM Revanth Reddy Padayatra

CM Revanth Reddy Padayatra

CM Revanth Reddy : ఇవాళ మరొకసారి మహారాష్ట్రకు వెళ్లనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రెండు రోజుల పాటు (16, 17 తేదీలలో) మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ బయలుదేరి, అక్కడ చంద్రాపూర్, రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్‌షోలు నిర్వహించి, రాత్రికి తిరిగి నాగ్‌పూర్ చేరుకుంటారు. అక్కడే ఆయన బస చేస్తారు. రెండో రోజున, ఆదివారం ఉదయం నాగ్‌పూర్ నుంచి నాందేడ్ చేరుకుని, నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం, అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగి రానున్నట్లు సమాచారం.

Indian Spices Combination : శీతాకాలంలో ఏ మసాలా దినుసుల కలయిక మంచిది.. నిపుణులు ఏమి చెప్పారో తెలుసుకోండి..!

ఈ నెల 20న మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVAG) కూటమి, అధికార మహాయుతి (NDA) కూటమి మధ్య పెద్ద పోటీపోటీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, రెండు ప్రధాన కూటములు గెలుపు కోసం వివిధ స్ధాయిల వద్ద ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు.

ఎన్డీయే కూటమి తరపున, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పీ. నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా, ఎన్డీయే నుండి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సందడి చేస్తున్నారు. ముంబైలో, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బీజేపీ నాయకులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ప్రచారానికి ఆహ్వానించారు. ఈ పరిస్థితిలో, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లనున్నారు.

Rohit Sharma blessed With Baby Boy: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగ బిడ్డకు జన్మనిచ్చిన హిట్ మ్యాన్ భార్య

  Last Updated: 16 Nov 2024, 10:48 AM IST