Site icon HashtagU Telugu

Cm Revanth Reddy : కుటుంబ డిజిటల కార్డుల ప్రక్రియను ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy Launches Family Digital Cards Programme

CM Revanth Reddy Launches Family Digital Cards Programme

Family Digital Cards in Telangana : సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న డిజిటల్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కుటుంబ డిజిటల్‌ కార్డులు ప్రవేశపెట్టినట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Read Also: Jani Master : జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్

గత కేసీఆర్ ప్రభుత్వంలో రేషన్‌కార్డు కోసం పదేళ్లు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అధికారంలో ఉంటే రేషన్‌కార్డు రాదని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు. కొత్త రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని అన్నారు. ప్రతి పేదవాడికి ఈ కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు కుటుంబానికి రక్షణ కవచమని అన్నారు. కార్డులో కుటుంబానికి సంబంధించిన వివరాలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ కలెక్టర్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కాగా, రాష్ట్రంలో ఈరోజు నుంచి కుటుంబ డిజిటల్​ కార్డుల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలు, వార్డులు, డివిజన్లలో ఈ నెల 7 వరకు అధికారులు ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలు నిర్ధారించుకుంటారు. మరణించిన వారిని తొలగించడం, కొత్తవారిని చేర్చడం వంటి ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

Read Also: TDP MLA: టీడీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇవ్వ‌టానికి సిద్ధ‌మైన చంద్ర‌బాబు..?